ఘనంగా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం

సింగరేణి మాజీ పర్యావరణ అధికారి ఎస్ రాంకుమార్*
ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 6 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
సింగరేణి ఉద్యోగులు విశ్రాంత జీవితాన్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో సహచరి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆస్వాదించాలని సింగరేణి మాజీ పర్యావరణ అధికారి ఎస్ రాంకుమార్ అన్నారు. మణుగూరు ఏరియా సింగరేణిలో తొలిసారి పదవీ విరమణ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం మణుగూరు తో గూడెం మినీ మేడారం ఎం కె ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్ కుమార్ మాట్లాడుతూ మణుగూరు ఏరియా పీకే ఓసి 2 రిలే సి లో ఈ పి ఆపరేటర్లుగా పనిచేసి పదవీ విరమణ అనంతరం తెలంగాణ తో పాటు ఆంధ్రప్రదేశ్ తో సహా వివిధ రాష్ట్రాలలో విశ్రాంత జీవితం అనుభవిస్తున్న మాజీ సింగరేణి మాజీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం పేరా కలుసుకోవటం అప్పట్లో రిలే- సి ఇన్ ఛార్జ్ గా పనిచేసిన తమను ముఖ్యఅతిథిగా,రిలే సి లోనే హెడ్ ఓవర్ మెన్ గా పనిచేసే గాని మేనేజర్ గా పదోన్నతి పొంది వివిధ ప్రాంతాల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన ఎస్ ధనుంజయ గారిని తమ ఇరువురిని కార్యక్రమానికి ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు.ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సింగరేణి తల్లి నీడలో సంతోషంగా జీవితం గడిపి విశ్రాంత జీవితం లో భాగంగా తిరిగి వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారందరిని సమీకరించి సింగరేణి మాజీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో తొలిసారిగా చక్కటి కార్యక్రమం నిర్వహించడం పట్ల, నిర్వాహకులను ఆయన అభినందించారు.ఇలాంటి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాలు మాజీ ఉద్యోగులు ఆత్మస్థైర్యాన్ని నింపుతాయని అన్నారు.ఈ సందర్భంగా పీకే ఓసి లో పనిచేసిన సమయంలో వారి అనుభవాలను సబికులతో పంచుకున్నారు ఉద్యోగపర్వంలో విశ్రాంత జీవితం అనే చివరి మజిలీలో నువ్వు నీకోసం జీవించు అనే సూత్రంతో జీవిత సహచరితో కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆరోగ్యంగా జీవితం గడపాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా పలురు మాట్లాడుతూ తమ అనుభవాలను తోటి వారితో పంచుకున్నారు.సుదీర్ఘ విరామం తర్వాత సుమారు ఎనభై మంది మాజీ ఆపరేటర్లు కలుసుకోవడం పలకరింపులు అలాయ్ బలాయి తో శాలువాలు జ్ఞాపికలతో అతిథులను అనంతరం మాజీ ఆపరేటర్లు ఒకరినొకరు సన్మానించు కోవటం పసందైన వంటకాలతో సహా పంక్తి భోజనాలు వీడ్కోలు ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ నేమ్మి కంటి పూర్ణచందర్రావు వ్యాఖ్యానం మిమిక్రీ లాంటి వినోదం అందరినీ ఎంతగానో అలరించాయి.పూర్వ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంతో ఎంకే ఫంక్షన్ హాల్ లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి అధ్యక్ష వర్గంగా మాజీ సీనియర్ ఆపరేటర్లు ఎం సాంబశివరావు, టి ఈశ్వరరావు,ఎస్ సమ్మారావు, అబ్దుల్ కరీం,వి పుష్పరాజ్ లు పాల్గొనగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహణ కమిటీ సభ్యులు వూటుకూరు సత్యనారాయణ, చింతల శ్రీరాములు, యలమంచిలి ఆనందబాబు,ఎస్ వెంకట సుబ్బయ్య, ఎండి ఇమాముద్దీన్,కోటపాటి సత్యనారాయణ,పి విద్యాసాగర్, జి బ్రహ్మచారి,కే లక్ష్మీనారాయణ, దరిసా విజయకుమార్, రాయుడు లక్ష్మణ స్వామి,సిహెచ్ వి రెడ్డి యస్ డి నాసర్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment