*రాములోరి కళ్యాణానికి ఆలయాన్ని రంగులతో తీర్చిదిద్దుతున్న సిబ్బంది*
*
*సీతమ్మవారికి భక్తుని విరాళం*
*ఇల్లందకుంట మార్చి 24 ప్రశ్న ఆయుధం*
అపర అయోధ్యగా పేరొందుతున్న ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణ ఏర్పాట్ల కోసం ఆలయ ప్రాంగణము ఆలయ శిఖరాలకు రంగులతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు ఆలయ ప్రాంగణమంతా చెట్లతో నిండి ఉన్న స్థలాన్ని చదివిస్తూ అందంగా తీర్చిదిద్దుతున్నారు సీతారాముల కళ్యాణానికి ఉభయ దాతలుగా ఉండుటకు భక్తులు రూపాయలు 3016/- చెల్లించి రసీదు పొందాలని కళ్యాణ దాతలకు శేష వస్త్రము స్వామివారి ఫోటో లడ్డు ప్రసాదం అందజేయబడుతుందని ఆలయ కార్య నిర్వహణ అధికారి కందుల సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు
*సీతమ్మవారికి భక్తుని విరాళం*
ఇల్లందకుంట రిటైర్డ్ తెలుగు పండిత్ మంతెన కృష్ణమూర్తి విమలాదేవి దంపతులు భక్తి భావంతో సీతమ్మవారికి 6.540 గ్రాముల బంగారు గొలుసును సోమవారం రోజున ఆలయ కార్య నిర్వహణ అధికారి కందుల సుధాకర్ కు అందజేశారు