Site icon PRASHNA AYUDHAM

గాంధారి పెద్దవాగు వంతెనపై విద్యుద్దీపాల ప్రారంభం

IMG 20250905 WA0111

గాంధారి పెద్దవాగు వంతెనపై విద్యుద్దీపాల ప్రారంభం

గాంధారి (కామారెడ్డి), సెప్టెంబర్ 5 (ప్రశ్న ఆయుధం):

గాంధారి మండల కేంద్రంలోని పెద్దవాగు వంతెనపై నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలను శుక్రవారం తహసీల్దార్ రేణుకా చౌహాన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – “వినాయక నిమజ్జనం, బతుకమ్మ ఉత్సవాల సందర్భాల్లో పెద్దవాగు ప్రధాన కేంద్రంగా ఉంటుంది. కొత్త విద్యుద్దీపాలు ఏర్పడటంతో ప్రజలకు మేలవుతుంది” అని తెలిపారు.

స్థానిక కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ – “ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ చొరవతో ప్రత్యేక నిధులు సమకూర్చి దీపాలను ఏర్పాటు చేయగలిగాం” అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎఎంసీ వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్, సొసైటీ చైర్మన్ సాయికుమార్, మాజీ ఎంపీపీ ఆకుల శ్రీనివాస్, ఎస్ఐ ఆంజనేయులుతో పాటు స్థానిక నాయకులు, పంచాయతీ సిబ్బందితదితరులు పాల్గొన్నారు.

Exit mobile version