బడ్జెట్లో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమతుల్య కేటాయింపులు
జమ్మికుంట/ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం జూలై 25
ఇల్లందకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్లో అన్ని వర్గాల ప్రజలకు సమతుల్యమైన కేటాయింపులు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వంగ రామకృష్ణ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను నెరవేర్చేందుకు పెద్దపీట వేసిందని పేదలకు ఇండ్లకు గృహ జ్యోతి పథకం విద్యా భరోసా రైతు భరోసా మహిళలకు మహాలక్ష్మి 2500 పెన్షన్ వ్యవసాయ వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్దపీట వేయడం జరిగిందని అలాగే బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ 9 000 కోట్లు కేటాయింపులు చేసిందని గత బిఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు వేల కోట్లు కేటాయించి తూతూ మంత్రంగా బీసీ రుణాలు ఇస్తామని చెప్పి బీసీలను మభ్యపెట్టిందని పార్లమెంట్లో మోడీ ప్రభుత్వం తెలంగాణకు బడ్జెట్లో సున్నా కేటాయింపులు చేసిందని బిజెపికి తెలంగాణ నుండి ఎనిమిది ఎంపీలను గెలిపించి పంపిస్తే బడ్జెట్ లో తెలంగాణ పేరు ఎత్తకుండా తెలంగాణ ప్రజలను అవమానపరిచిందని దేశం బాగుపడాలంటే గ్రామాల అభివృద్ధి చెందినప్పుడే అది సాధ్యమవుతుందని అంటారు కానీ ఒక్క రూపాయి కూడా గ్రామాల కేటాయించలేదని ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం తెలంగాణలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ను చూసైనా బడ్జెట్లో మార్పులు చేసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నమని పార్లమెంట్లో బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మోతే మహేందర్ వర్మ రావుల రాజబాబు రావుల ఎల్లయ్య మురారి రాజు తదితరులు పాల్గొన్నారు