“తెలంగాణ రైజింగ్ విజన్–2047” రూపకల్పనలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం: రాష్ట్ర ప్రభుత్వ పిలుపు

“తెలంగాణ రైజింగ్ విజన్–2047” రూపకల్పనలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం: రాష్ట్ర ప్రభుత్వ పిలుపు

అన్ని ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా సర్వేలో పాల్గొనాలి – సర్క్యులర్ జారీ

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం అక్టోబర్ 14

రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూపొందిస్తున్న “తెలంగాణ రైజింగ్ విజన్–2047” డాక్యుమెంట్ రూపకల్పనలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందుతున్న ఈ విజన్–2047 డాక్యుమెంట్‌లో ప్రజల సూచనలు, సలహాలు ప్రతిబింబించేలా సిటిజన్ సర్వే ప్రారంభమైంది. ఈ సర్వే అక్టోబర్ 10న ప్రారంభమై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్‌ఆర్‌ఐలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.

ఉద్యోగులందరూ తప్పనిసరిగా పాల్గొనాలి

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా ఈ సర్వేలో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. అక్టోబర్ 25 వరకు కొనసాగనున్న ఈ విజన్–2047 సర్వేలో ఉద్యోగులు తమ విలువైన అభిప్రాయాలు, సూచనలు అందించాల్సిందిగా ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

ప్రచారం విస్తృతంగా చేయాలి

సర్క్యులర్ ప్రకారం, ప్రతి కార్యాలయంలో ఈ సర్వేకు సంబంధించిన లింక్ మరియు QR కోడ్ ప్రదర్శించడంతో పాటు విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు.

సర్వేలో పాల్గొనదలచినవారికి లింక్

ఈ సర్వేలో పాల్గొనదలచిన వారు క్రింది లింక్ ద్వారా తమ సలహాలను పంపవచ్చు: http://www.telangana.gov.in/telanganarising/

ప్రతి పౌరుడి పాత్ర కీలకం

రాష్ట్ర భవిష్యత్తు దిశను నిర్దేశించే “తెలంగాణ రైజింగ్ విజన్–2047” రూపకల్పనలో ప్రతి ఉద్యోగి, ప్రతి పౌరుడి భాగస్వామ్యం అత్యంత కీలకమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment