కరీంనగర్ నాకా చౌరస్తాలో అబ్దుల్ కలాం విగ్రహం ఏర్పాటు చేయాలి

కరీంనగర్ నాకా చౌరస్తాలో అబ్దుల్ కలాం విగ్రహం ఏర్పాటు చేయాలి

బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్

కరీంనగర్ అక్టోబర్ 15 ప్రశ్న ఆయుధం

కరీంనగర్ పట్టణంలోని నాకా చౌరస్తాలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహం ఏర్పాటు చేయాలని బిజెపి మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ కోరారు. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రకటన విడుదల చేశారు భారత పదకొండవ రాష్ట్రపతి గా పనిచేసిన అబ్దుల్ కలాం అంతకుముందు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో ) లో ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేశారని గుర్తు చేశారు.1998 లో భారత దేశ పాక్రాన్.2, అను పరీక్షల్లో కీలకమైన సంస్థగత , సాంకేతిక లో అబ్దుల్ కలాం కీలక పాత్ర పోషించారన్నారు. అందుకే అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. అబ్దుల్ కలాం భావితరాలకు గుర్తుండిపోయేలా ఆయన విగ్రహాన్ని కరీంనగర్లో ఏర్పాటు చేయాలని అధికారులకు , ప్రజా ప్రతినిధులకు ఆయన ఈ సందర్భంగావిజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment