మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం
బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బోట్ల యాదయ్య ఆధ్వర్యంలో…..
ప్రశ్న ఆయుధం జనవరి 30
కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలతో సాధ్యం కానీ 420 హామీలతో అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము నేటికీ 420 రోజులు గడిచిన సందర్భంగా మోటకొండూర్ మండల కాటపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు….
మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుచుకొని స్వరాష్ట్రాన్ని సాధించి ఆయన ఆశయాలకు స్ఫూర్తిగా గత పదేళ్ల కేసిఆర్ పరిపాలనలో సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో విప్లవాత్మకమైన పథకాల కోసం శ్రీకారం చుట్టి,తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని సమూలంగా మార్చి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి గా చేసిన ఘనత కేసీఆర్ ది
దేశానికి వెన్నుముక అయిన రైతుకు తెలంగాణలో రేవంత్ సర్కార్ వరుస వెన్నుపోట్లు పొడుస్తుందని, రైతు భరోసా కింద 15000 ఇస్తామని నమ్మబలికి ఏడాది గడిచిన చివరకు రూ.6000 ఇస్తున్నారని వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టి రైతులను మళ్లీ అప్పులపాలు చేశారని, ఎరువులు విత్తనాలు కోసం మళ్లీ క్యూ లైన్లు, కరెంటు కోతలు,వరికి 500 బోనస్ పేరిట బోగస్ మాటలు ,ఇవన్నీ కపట కాంగ్రెస్ పాలనలో రైతన్నకు 420 రోజులు ఎదురైన చేదు అనుభవాలు ఓవైపు,రుణమాఫీ మోసం మరోవైపు,పెట్టుబడి భారం తట్టుకోలేక ఇప్పటికీ 410 మందికి పైగా రైతు మరణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైంది.మరోవైపు నేతన్నలకు ఇచ్చిన హామీలు కూడ నెరవేర్చలేదని చేనేత బతుకులు చితికిపోయాయని తెలిపారు..మహిళలకు 2500 ఇస్తామన్నారని, కల్యాణ లక్ష్మి తో పాటు తులం బంగారం అందిస్తామని మోసం చేయడంలో ఆడబిడ్డలు రగిలిపోతున్నారని, వృద్ధులు వితంతువు పింఛన్లు రూ.4000 పెంచుతామని నమ్మబలికి అధికారంలోకి వచ్చారని, ఈ సంక్షేమ పథకాల ఇప్పటి వరకు ఉలుకు పలుకులేని లేదని సర్కార్ పై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారని, యువతకు రెండు లక్షల ఉద్యోగాలు హామీని, జాబ్ క్యాలెండర్ వాగ్దానాన్ని మొత్తంగా ముఖ్యమంత్రి గంగలో కలిపేసారని చివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం నింపిన ఉద్యోగాలను తన జేబులో వేసుకొని నీచ రాజకీయాలకు తెరదీశారని యువత భవిత అంధకారంలోకి నెట్టి క్షమించలేని పాపం చేశారని తెలియజేస్తూ ఈ అసమర్ధ ప్రభుత్వము కళ్ళు తెరిపించి ఈ దద్దమ్మ కాంగ్రెస్ కు దారి చూపించి, ఈ చేతకాని సర్కారుకు బుద్ధి ప్రసాదించి ఈ అసమర్ధ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించమని మహాత్మా గాంధీకి వినతిపత్రం రూపంలో బీఆర్ఎస్ నాయకులు తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాస్ రెడ్డి మండల కోఆప్షన్ సభ్యులు ఎండి బురాన్ కాటేపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు కానుగంటి కొమురయ్య మాజీ ఎంపిటిసి నాగిరెడ్డి గడ్డం నర్సిరెడ్డి సుధా గాని శ్రీనివాస్ మోటకొండూర్ యూత్ అధ్యక్షులు బొట్ల మహేష్ బొట్ల ప్రశాంత్ వడ్లకొండ సాయి కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..