*కట్టుకథలు అల్లి తప్పుడు కేసులా..?*
*గౌరవనీయ హైకోర్టు ఆదేశాలను కూడా తప్పుదోవ పట్టిస్తూ ప్రచారమా..?*
*నాతోపాటు,నా కటుంబసభ్యులపై తప్పుడు కేసులు పెడతారా..మా మామయ్య మీద మా మరిది మీద కేసులు పెడతారా*
*నాది పురుషోతమపట్నం అనే సంగతి మర్చిపోవద్దు*
*నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలపై కేసులు*
*అక్రమ కేసులు, అక్రమ సంపాదనపైనే పుల్లారావు దృష్టి*
*నాకంటూ ఒక రోజు వస్తుంది.. ఆ రోజు చర్యకు ప్రతి చర్య కచ్చితంగా ఉంటుంది*
*అక్రమ కేసులకు బెదిరేది లేదు*
*కార్యకర్తల జోలికి వచ్చే వారిని ఎవరినీ మరిచిపోం*
*అక్రమ కేసుల నమోదుపై స్పందించిన మాజీ మంత్రి విడదల రజిని*
*చిలకలూరిపేటలో మీడియా సమావేశం*
*విడదల రజిని ఏమన్నారంటే..*
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది
ఇష్టం వచ్చినట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కేసులు పెడుతున్నారు
అక్రమ కేసులు పెట్టడం అనేది ఒక ప్రభుత్వ విధానంలాగా కొనసాగుతోంది
చిలకలూరిపేట నియోజకవర్గంలో అయితే ఆటవిక, అరాచక పాలన కొనసాగుతోంది
స్థానిక ఎమ్మెల్యే అవినీతిలో ఘనాపాటి అయిన ప్రత్తిపాటివ పుల్లారావు తప్పుడు ఫిర్యాదులు ఇప్పించి అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారు
ఐదున్నరేళ్ల కిందట అట.. టీడీపీ సామాజిక కార్యకర్త సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టాడట… దానిపై కేసు నమోదైందట.. పోలీసులు వారి ప్రొసీజర్ ఫాలో అయి ఉంటారు…
ఇందులో నా ప్రమేయం ఏం ఉంటుంది..? దీనికి, నాకు ఏం సంబంధం ఉంది..?
ఇదొక కట్టుకథ..
సామాజిక కార్యకర్తతతో ఎమ్మెల్యే ఫిర్యాదు ఇప్పిస్తాడు. ఎమ్మెల్యే పుల్లారావే తప్పుడు ఫిర్యాదు ఇప్పించారు అని ప్రజలు అనుకుంటారని మరో కుట్రకు శ్రీకారం చుడతారు.
ఇదే ఫిర్యాదుతో హైకోర్టులో పిటిషన్ వేస్తారు
వీరి ఫిర్యాదుపై గౌరవనీయ హైకోర్టు పోలీసులను కేవలం వివరాలు మాత్రమే కోరింది. వివరాలు కోరుతూ ఫిబ్రవరి రెండో వారానికి హైకోర్టు కేసును వాయిదా వేసింది.
కానీ దీన్ని దుష్ప్రచారం చేశారు.
గౌరవనీయ హైకోర్టు ఆదేశాలను దుర్వినియోగపరుస్తూ ప్రత్తిపాటి పుల్లారావు తోపాటు కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.
కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఒకటైతే.. హైకోర్టు కేసులు పెట్టాలని ఆదేశించినట్లుగా తప్పుడు ప్రచారం చేసి, ఆ ప్రచారాన్ని అడ్డంపెట్టుకుని పోలీసులతో నాపై అక్రమ కేసులు పెట్టించారు.
ఒక కథ అల్లి అక్రమ కేసులు పెట్టాలనే ప్రయత్నంలో గౌరవనీయ హైకోర్టు ఆదేశాలను కూడా దుర్వినియోగం చేశారు.
ఇదంతా ఒక పెద్ద డ్రామా.
నాపై కావాలనే ఒక కట్టుకథ అల్లి.. ఆ కథను ఫిర్యాదు రూపంలో పోలీసులకు అందజేసి ఒక తప్పుడు కేసు నాపై పెట్టారు.
ఇంతేకాదు.. కరెంటు చార్జీల పెరుగుదలపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నిరసనలు చేపట్టింది.
రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరిగితే.. ఒక్క చిలకలూరిపేటలో మాత్రమే నాతోపాటు మరో 30 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టారు.
వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు చిలకలూరిపేటలో బయటకు రాకుడదంటా.. అన్ని గ్రామాల నుంచి వేధింపులు ఉంటున్నాయి.
పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు. అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. అన్యాయంగా జైళ్లకు పంపుతున్నారు.
స్వయంగా మా మామగారిపై కూడా కేసులు పెట్టారు. 80 ఏళ్ల కు పైగా వయసున్న మా మామగారిపై కూడా అక్రమ కేసులు పెట్టారు
నా మరిది ఫారిన్ సిటిజన్. ఆయన అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. అలాంటి వ్యక్తిపై కూడా ఎమ్మెల్యే పుల్లారావు ఇక్కడ అక్రమ కేసులు పెట్టించారు.
నాకేనా కుటుంబం ఉంది… మీకు లేదా కుటుంబం. ఎన్ని రోజులు ఇలా నడుస్తుందని మీరు అనుకుంటున్నారు.
ఈ రోజు నాకుటుంబాన్ని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు.
—
నేను కూడా ఇక్కడ ఐదేళ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశాను. ఇలాంటి అరాచకపాలనకు నేను ఎక్కడా పాల్పడలేదు. మేం ఎవరిపై తప్పుడు కేసులు నమోదుచేయలేదు. అక్రమాలు చేయలేదు. శాంతివాతావరణం చిలకలూరిపేటలో ఉండేలా చేశాం.
అందరూ సంతోషంగా ఉండాలని చూశాం. కష్టాల్లో ఉన్నవారికి అండగా ఉండేలా పనిచేశాను.
నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా చిలకలూరిపేటలకు మంచి ఆస్పత్రి వచ్చేలా చేశాను. ఈ రోజు వేలాది మందికి చక్కటి వైద్య సేవలు అందుతున్నాయి
చిలకలూరిపేట ప్రజల కల అయిన బైపాస్ పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకున్నాం. రైతులకు రావాల్సిన డబ్బులు త్వరగా ఇప్పించి, ప్రభుత్వం నుంచి సపోర్టు ఇచ్చి శరవేగంగా బైపాస్ అందుబాటులోకి వచ్చేలా నిరంతరం పనిచేశా. దాని ఫలితంగా ఈ రోజు ఒక మంచి రోడ్డు అందుబాటులోకి వచ్చింది.
అమృత్ పథకం చివరి దశలో ఉంది…
ఇలా మంచి పనులు చేయడంపై దృష్టి పెట్టండి
ఈ రోజు చిలకలూరిపేట నియోజకవర్గంలో రైతులు పంటలకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు
మీ ప్రభుత్వం పుణ్యమా అని నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు
మీ ప్రభుత్వానికి, మీకు ట్యాక్సులు కట్టలేక వ్యాపారులు ఆవేదనలో ఉన్నారు
ఇవేవీ మీకు పట్టవు.
మీ పూర్తి దృష్టి రెండు అంశాలపైనే
అవి ఏంటంటే.. విడదల రజినిపై, విడదల రజిని కుటుంబసభ్యులపై, వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టాలి.. అక్రమ అరెస్టులు చేయాలి
రెండో అంశం అక్రమ సంపాదన. జేబులు నింపుకోవడం
అక్రమ కేసులు, అక్రమ సంపాద. మీ ఫోకస్ అంతా ఈ రెండింటిపైనే ఉంది.
ఇందులో కనీసం పది శాతమైన ప్రజల సమస్యలపై దృష్టి పెడితే ఈ నియోజకవర్గం బాగుపడుతుంది
కానీ ఇవేవీ మీకు పట్టడం లేదు.
—
మేం అధికారంలో ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో నేను చర్యలు తీసుకోవాలనుకుంటే…
2014-2019 మధ్య మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన పాపాలు, మీరు చేసిన స్కామ్‌లు, వీటిని ప్రశ్నించిన జర్నలిస్టుల మర్డర్ల వరకు… వీటిపై మేం అధికారంలో ఉండగా ఒక్కసారి ఆలోచించి ఉంటే పుల్లారావుగారు మీరు ఏమైపోయి ఉండేవారు.
ఇప్పుడు మీరు మాపై అక్రమ కేసులుపెడతారా..?
మా గొంతు నొక్కేస్తారా..?
—
ఈ రోజు మీరు చేస్తున్నది ఏంటంటే..
ఈ నియోజకవర్గంలో జరగని అసాంఘిక కార్యక్రమాలు ఏమున్నాయి..?
పేకాట నడుస్తోంది. గ్రానైట్, గ్రావెల్, సెటిల్ మెంట్లు, అక్రమాలు, అన్యాయాలు, బార్‌షాపులు, బెల్ట్‌షాపులు.. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి….
సూపర్ సిక్స్ హామీలతో ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. ఎలా పనిచేస్తారో అని మేం ఎదురుచూస్తున్నాం. క్రమశిక్షణగా ఉన్నాం. చీప్ పాలటిక్స్ మేం చేయట్లేదు
మీలా ఎవరినో అడ్డం పెట్టుకుని ఏదో చేస్తామంటే నాకు నవ్వువస్తోంది…
ఎందుకో చెప్పనా.. నా రాజకీయ అనుభవం ఏడేళ్లు. నా ఏడేళ్ల రాజకీయ అనుభవం ముందు నీ 25 ఏళ్ల రాజకీయ అనుభవం ఈ రోజుతో తలదించుకుంది అని అనిపిస్తోంది.
అక్రమ కేసులు పెడతారా..? భయపెట్టాలని చూస్తారా..? మీరు నన్ను గాని, నా కుటుంబసభ్యులను గాని, మా పార్టీ నాయకులను గాని అక్రమ కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు చేస్తే మేం ఎవరం భయపడం.
ఇంకా బలంగా ముందుకు వెళతాం
—
ఇంకో నాలుగేళ్లు కదా.. వీలైనంతగా సంపాదించుకుని రాజకీయాల నుంచి రిటైర్ అయిపోదామని అనుకుంటున్నారు..
ఇప్పటి నుంచి మొదలుపెట్టినా ఇంకో 35 నుంచి 40 ఏళ్లపాటు నేను ఇక్కడే రాజకీయాలు చేస్తాను. మీరు ఎక్కడా ఉన్నా.. ఏ ఊర్లో ఉన్నా.. వడ్డీతో సహా మీకు చెల్లిస్తాం.
గ్రామాల్లో, వార్డుల్లో కయ్యానికి కాలుదువ్వి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నవారెవరినీ వదిలిపెట్టం.
అందరి సంగతి తేలుస్తాం..
అధికారులంటే నాకు ఎంతో గౌరవం ఉంది.
ప్రజలకు మంచి పనులు అధికారులు చేయాలి. ప్రజలకు గుర్తుండేలా పనిచేయాలి.
అక్రమాలు, అవినీతి పనులకు మీరు అండగా ఉండొద్దు.
కొంతమంది చాలా అత్యుత్సాహానికి పోతూ అక్రమాలు చేయాలని చూస్తున్నారు.
అత్యుత్సాహంతో ముందుకు వెళ్లే అధికారులను మరిచిపోం.
భవిష్యత్తులో వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయి.
—
మమ్మల్ని తప్పుడు కేసుల్లో ఇరికించి.. ఇబ్బంది పెట్టాలని చూస్తే… చర్యకు అదే స్థాయిలో ప్రతి చర్య ఉంటుందనే న్యూటన్ థర్డ్ లా ను గుర్తుంచుకోండి.
మా కంటూ ఒక రోజు వస్తుంది.. మా జగనన్న ప్రభుత్వ ఒక రోజు వస్తుంది. ఆ రోజు మీ సంగతి తేలుస్తాం.