రైతులకు రుణమాఫీ ముగిసిన కథ..!!

*_రైతులకు రుణమాఫీ ముగిసిన కథ..!!_*

అర్హులందరికీ ఇచ్చినం.. ఇగ ఇచ్చేదేం లేదు

అసెంబ్లీలో మంత్రి తుమ్మల సంచలన ప్రకటన

హైదరాబాద్‌, మార్చి 22 రూ.2 లక్షలకుపైగా రుణాలు ఉన్న రైతు కుటుంబాలకు రుణమాఫీ చేసేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్పష్టంచేశారు.

అర్హులైన రైతులందరికీ ఇప్పటికే రుణమాఫీ చేశామని, ఇక ఇచ్చేది కూడా ఏమీ లేదన్నట్టుగా మాట్లాడారు. ఈ మేరకు శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి తుమ్మల బదులిచ్చారు.

రుణమాఫీ సర్వే సమయంలో కొంతమంది రైతుల వివరాలు తమకు ఇవ్వలేదని ఒప్పుకుంటూనే, చేయాల్సిన కాడికి రుణమాఫీ చేశామని చెప్పారు. ‘రుణమాఫీకి సంబందించి వీళ్ల దగ్గర (బీజేపీ ఎమ్మెల్యేల వైపు చూస్తూ) కన్ఫ్యూజన్‌ ఉన్నది. కానీ నా దగ్గర కన్ఫ్యూజన్‌ లేదు. ప్రభుత్వానికి అంతకంటే కన్ఫ్యూజన్‌ లేదు. చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఖాతాలు వేరు.. కుటుంబాలు వేరు.

ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు మీకు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే.. రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలు మాత్రమే మాఫీ చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం. రూ.2 లక్షలకుపైన లేదు. రూ.2 లక్షలలోపు బ్యాంకు రుణాలు ఉన్న కుటుంబాలు 25 లక్షలు ఉన్నట్టు మాకు వివరాలు చేరినయి అధ్యక్షా! ఆయా కుటుంబాలకు రూ.20,616 కోట్లు జమ చేయటం జరిగిందని గౌరవ సభ్యులకు సవినయంగా మనవి చేస్తున్నా. మీరు కన్ఫ్యూజ్‌ కావొద్దు.. ప్రజలను కన్ఫ్యూజ్‌ చేయొద్దు’ అని తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో స్పష్టంగా ప్రకటించారు.

Join WhatsApp

Join Now