భారత త్రివిధ దళాల బలమెంత?

*భారత త్రివిధ దళాల బలమెంత?*

‘గ్లోబల్ ఫైర్ పవర్’ వెబ్‌సైట్ ప్రకారం 2025 మిలటరీ ర్యాంకింగ్‌‌లలో భారత్.. పాకిస్తాన్ కంటే ముందుంది.

2025లో అంతర్జాతీయ సైనిక శక్తికి సంబంధించి 145 దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉంటే పాకిస్తాన్ ర్యాంకు 12.

భారత్ దగ్గర దాదాపు 22 లక్షల సైన్యం ఉంది.

4,201 యుద్ధ ట్యాంకులు, దాదాపు లక్షా 50 వేల ఆర్మర్డ్ వెహికల్స్, 100 సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ, 3,975 టోవ్డ్ ఆర్టిలరీ ఉన్నాయి.

దీంతో పాటు మల్టీ బారెల్ రాకెట్ ఆర్టిలరీ 264 ఉన్నాయి.

భారత వాయుసేన దగ్గర 3 లక్షల10 వేల మంది బలగం ఉంది.

2,229 విమానాలున్నాయి. వాటిలో 513 ఫైటర్ విమానాలు కాగా, 270 రవాణా విమానాలు. 130 అటాక్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 351 శిక్షణ విమానాలు, ఆరు ట్యాంకర్ ఫ్లీట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లున్నాయి.

భారత సైన్యానికి చెందిన మూడు విభాగాల దగ్గర 899 హెలికాప్టర్లున్నాయి.

వాటిలో 80 అటాక్ హెలికాప్టర్లు.

భారత నౌకాదళం దగ్గర లక్షా 42 వేలమంది సెయిలర్లు ఉన్నారు.

రెండు విమాన వాహక నౌకలు సహా మొత్తం 293 నౌకలున్నాయి.

వాటిలో 13 డిస్ట్రాయర్లు, 14 ఫ్రిగేట్లు, 18 సబ్‌మెరైన్లు, 18 కర్వెట్టీలు ఉన్నాయి.

భారత ఆర్మీ పరిధిలో 311 ఎయిర్‌పోర్టులు, 56 పోర్టులు ఉన్నాయి..

Join WhatsApp

Join Now