Headlines in Telugu
-
జానపద నృత్య పోటీల్లో గొప్ప ప్రతిభ చూపిన పెద్దపల్లి విద్యార్థులు
-
రాష్ట్రస్థాయి పోటీల్లో రెండో స్థానంతో మెరిసిన పెద్దపల్లి పాఠశాల
-
పర్యావరణ పరిరక్షణ అంశంపై శ్రేష్ఠ ప్రదర్శన
-
విద్యార్థుల ప్రతిభను ప్రశంసించిన డీఈవో గోవిందరాజులు
-
జానపద నృత్య గైడ్ టీచర్ చాంద్ భాషా సేవలను కొనియాడిన అధికారులు
అభినందించిన డీఈవో
పర్యావరణ పరిరక్షణ అంశంపై ఎస్ సి ఈ ఆర్ టి తెలంగాణ వారు, గోదావరి ఆడిటోరియం హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి జానపద నృత్య పోటీలలో పెద్దపల్లి పాఠశాల విద్యార్థులు ద్వితీయ బహుమతి గెలుచుకోవడం జరిగింది.వీరికి గైడ్ టీచరుగా చాంద్ భాషావ్యవహరించారు.
ఇచ్చిన అంశానికి తగ్గట్టుగా తమ నృత్య ప్రతిభను కనబరచిన విద్యార్థులు శ్రావణి, వసుంధర, స్వప్న,స్వాతి,గీతామాధురి లౌకికలను జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ గోవిందరాజులు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎస్ సి ఈ ఆర్ టి డైరెక్టర్ రమేష్ గారు,ఏఎంవో ఏం. డి. షర్ఫుద్ధీన్ ,ఉపాధ్యాయులు శ్రీనివాసులు, మల్లేష్, ఉపాధ్యాయిని లలిత పాల్గొన్నారు.