*ఈనెల 22న హైదరాబాదులో జరిగే ఉద్యమకారుల సదస్సును విజయవంతం చేయాలి*
*ఉద్యమకారులకు ఫోరం నియోజకవర్గ, మండల కమిటీ నియామకం*
*ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎక్కేటి సంజీవరెడ్డి*
*జమ్మికుంట జూలై 20 ప్రశ్న ఆయుధం*
ఈనెల 22న హైదరాబాదులోని గన్ పార్క్ లో నిర్వహించే ఉద్యమకారుల సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎక్కేటి సంజీవరెడ్డి అన్నారు. ఆదివారం జమ్మికుంట పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశములో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాద్యక్షుడు ఎక్కేటి సంజీవరెడ్డి మట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు హుజురాబాద్ నియోజకవర్గ జమ్మికుంట, ఇల్లందకుంట మండల కమిటీని ప్రకటించడం జరిగిందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎక్కటి సంజీవరెడ్డి నియామాకపు ఉత్తర్వులు అందజేశారు.హుజురాబాద్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శిగా నకీర్త రాజు ను జమ్మికుంట మండల ఉపాద్యక్షునిగా పేరవేని రమేష్ ఇల్లందకుంట మండల సహాయ కార్యదర్శిగా గుడికందుల రాజయ్యను నియమిస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎక్కటి సంజీవరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు ఈనెల 22 మంగళవారం రోజున జరిగే చలో ఘన్‌పార్క్ హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమానికీ తెలంగాణ ఉద్యమకారులు తమ విధిగా భావించి హజరు అయి వారి హక్కుల కోరకు ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమoలో ఆరే రమేష్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గ కార్యదర్శి పాకాల మల్లారెడ్డి, గురుకుంట్ల.రాజీరు, ముత్యాల.రమేష్, పెరవేన.కుమార్ యాదవ్ మిల్కూరి.మల్లారెడ్డి తధితరులు పాల్గొన్నారు.