*మహాబోధి మహావిహార్ ఉద్యమానికి తెలుగు ముంబైకర్ల మద్దతు*
ప్రశ్న ఆయుధం జూన్ 7 బీహార్ రాష్ట్రంలో ఉన్న ఐతిహాసిక మహాబోధి మహావిహార్ ను బుద్ధిస్టులకే చెందాలి, బి.టి చట్టం రద్దు చేయాలనే డిమాండ్ తో ముంబై చెంబూర్లో గల అంబేడ్కర్ పార్క్ లో మహాబోధి మహావిహార్ సంఘర్ష్ సమితి -ముంబై ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్ష గత గురువారం నుంచి ఉదృతంగా సాగుతుంది. దీనికి సంఘర్ష్ సమితి చీఫ్ ప్రదీప్ అడంగ్లే బలమైన నాయకత్వంతో ప్రారంభమైంది. శనివారం దీనికి బహిరంగంగా మద్దతు ఇవ్వడానికి తెలుగు ముంబైకర్లు హాజరైయ్యారు. ఈ సందర్భంగా సంఘర్ష్ సమితి ప్రముఖులు ప్రదీప్ అడాంగ్లే మాట్లాడుతూ బీహార్లో జరుగుతున్న శాంతియుత ఉద్యమంలో అనేక మంది బౌద్ధ భిక్షువులపై అక్రమ కేసులు బనాయించిన వాటిని వెంటనే తొలగించాలి, అప్రకటిత నిర్బంధం తొలగించాలి, సత్వరమే మహాబోధి మహావిహార్ బుద్ధిస్టులకే చెందాలంటూ డిమాండ్ చేశారు. బీహార్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు జవాబుదారీగా వ్యవహరించాలని ముంబై బుద్ధిస్టులు కోరారు. ఇందులో ఎం.టి.బి.ఎఫ్ నాయకులు బొల్లి శివరాజ్, గోల్కొండ శంకర్, చుక్క నరసింహ, అంబేడ్కరైట్ యువ నాయకులు సాయి వికాస్, రవీందర్ ముత్యాల, జగదీష్ మచ్చ, ఉదరీ కృష్ణ మాదిగ, మంద రాజు మహారాజ్, జీ.రాజు మహారాజ్, గన్నారపు శంకర్, మూలనివాసి మాలజీ తదితరులు సంఘీభావం ప్రకటించారు.