సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తికిఅవమానం…
సేకరణ వ్యాసకర్త సామాజికవేత ఎం శ్రీనివాస్ కుమార్
భారత న్యాయవ్యవస్థలో అత్యున్నత పదవి కలిగి ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ బీ ఆర్ గవాయ్ ఇవ్వాల్సిన గౌరవం మర్యాదలు ఇవ్వలేదు మహారాష్ట్రలో ఆయన హాజరైన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తో పాటు ముంబై పోలీస్ కమిషనర్ తప్పనిసరిగా హాజరై ఆహ్వానించాలి కార్యక్రమాలతో పాటు తదనంతరం అతని వీడ్కోలు పలికే వరకు వెంట ఉండి రక్షణ భద్రత తో పాటు ప్రభుత్వ పరంగా అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ పై ముగ్గురు ఆయన వెంట ఉండకపోవడంతో ప్రోటోకాల్ పాటించలేదు. దీనిపై తన సొంత రాష్ట్రమైనా మహారాష్ట్రకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో తొలిసారిగా విచ్చేస్తున్నప్పుడు సాధారంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అధికారిక హోదాలో స్వాగతం పలకాలి కానీ అలా జరగలేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి ఆర్ గవాయ్ పాల్గొన్న కార్యక్రమాలు కూడా వారు పాల్గొనలేదు. దీంతో అసహనం వ్యక్తం చేసి రాష్ట్ర అధికారిక యంత్రాంగం పాల్గొనకపోతే ప్రశ్నించారు. ఈ విషయాన్ని గ్రహించిన అధికారులు సమాచార అంతర్యం వల్ల జరిగినట్టు చెప్పే ప్రయత్నం చేశారు. అందుకు సమాధానంగా న్యాయవ్యవస్థకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని తద్వారా వ్యవస్థలకు గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాలని చెప్పారు. న్యాయ వ్యవస్థకు ఇవ్వాల్సిన ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం వ్యక్తిగత కారణాల వ్యవస్థ లోపాల ప్రజలు గమనిస్తున్నారు. బిఆర్ గవాయ్ మాట్లాడుతూ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోనని తెలిపారు. ఆయన నిరాడంబరతకు దార్శనికతకు నిదర్శనం. ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయవ్యవస్థకి ఇవ్వాల్సిన గౌరవాన్ని, కల్పించడంలో పక్షపాత వైఖరి తేటతెల్లమయింది. ఇందుకు ప్రధాన కారణం దళిత జడ్జ్ ప్రధాన న్యాయమూర్తి కావడమేనా ? న్యాయవ్యవస్థలో అవినీతి ఉందని ఆరోపణ చేసిన మాజీ హైకోర్టు న్యాయమూర్తి కన్నన్ కి ఆరు నెలలు జైలు శిక్ష విధించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఇంట్లో నోట్ల కట్టలు కాలిపోయి దొరుకుతే అతనిని బదిలీతో వదిలేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో తన సొంత రాష్ట్రంలో మహారాష్ట్ర పర్యటనలో న్యాయవ్యవస్థకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రాధాన్యతని ప్రభుత్వ అధికారులు బిఆర్ ఘవాయి పర్యటనలో ఇవ్వాల్సి గౌరవ మర్యాదలు ఇవ్వలేదు. ప్రజాస్వామ్య దేశంలో న్యాయవ్యవస్థలో వివక్ష మరోసారి తేటతెల్లమయింది.