*Supreme Court: కలెక్టర్లకు ఆ ఛాన్స్ ఇవ్వలేం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు*
సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. గ్రామీణ ప్రజాస్వామ్యాన్ని నిరుత్సాహపరిచే అవకాశం బ్యూరోక్రాట్లకు ఇవ్వలేమని పేర్కొంది. మహారాష్ట్రలో ఓ మహిళను గ్రామ సర్పంచిగా తిరిగి నియమిస్తూ బాంబే హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
రాయ్గఢ్ జిల్లాలోని రోహా తాలుకా ఐంఘడ్ గ్రామ సర్పంచ్ కళావతి రాజేంద్రపై గతేడాది స్థానిక కలెక్టర్ అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం కొత్త సర్పంచ్ను ఎన్నుకునేందుకు రిటర్నింగ్ అధికారిని కూడా నియమించారు. దీనిపై బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కలెక్టర్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని 2024, జులై 7న బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది.
గ్రామీణ స్థాయి ప్రజాస్వామ్యాన్ని నిరాశపరిచే ఛాన్స్ బ్యూరోక్రాట్లకు ఇవ్వకూడదని” జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. పలు సందర్భాల్లో ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు వేసేందుకు పాత కేసులను బయటకి తీసేందుకు యత్నిస్తున్నట్లు గుర్తించామని పేర్కొంది.