ఎస్సీ వర్గీకరణ సుప్రీం తీర్పు హర్షనీయం
కర్రోళ్ళ రవిబాబు రాష్ట్ర కార్యదర్శి ధర్మ సమాజ్ పార్టీ
సిద్దిపేట ఆగస్టు 01( ప్రశ్న ఆయుధం ) :
భారత అత్యున్నత న్యాయస్థానం, ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం భారత రాజ్యాంగం సూత్రికరణ ప్రకారం విద్యా, ఉద్యోగ రంగాలలో సామాజిక న్యాయాన్ని చట్టబద్ధం చేస్తూ ఎస్సీ, ఎస్టీ ఉపకులాల వర్గీకరణ పై అనుకూలంగా తీర్పు ఇవ్వడం పట్ల ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రోల్ల రవిబాబు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించిన తీర్పు వెలువరించిన దానిని స్వాగతిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో ఎస్సీ ఉప కులాలు మరియు ఎస్టి ఉప కులాలల్లో ఉన్నా ప్రస్తుత జనాభా దామాషా ప్రకారం అమలు జరిగేలా చూడాలని ఇదివరకు ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులను కలుపుకొని ప్రత్యేక నోటిఫికేషన్లను వెలువరించి దీనితోపాటు ప్రస్తుత డీఎస్సీ మరియు ఇతర నియామకాలలో కూడా జాతీయ మరియు రాష్ట్రీయ స్థాయిలో ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో ఎస్సీ, ఎస్టీ ఉప కులాలకు రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేశారు.