Site icon PRASHNA AYUDHAM

17మంది మావోయిస్టుల లొంగుబాటు.. రూ.24లక్షల రివార్డు

IMG 20250314 WA0039

*17మంది మావోయిస్టుల లొంగుబాటు.. రూ.24లక్షల రివార్డు*

ఛత్తిష్ ఘడ్ :

ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో 17 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 9మంది తలలపై రూ.24లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సీఆర్పీఎఫ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన వారిలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు దినేష్ మొడియం, అతడి భార్య జ్యోతి తాటి అలియాస్ కళా మొడియం ఉన్నట్లు తెలిపారు. దినేష్ తలపై రూ.8లక్షలు, జ్యోతిపై రూ.5లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు బీజాపూర్ సీనియర్ ఎస్పీ తెలిపారు.

 

Exit mobile version