ఎన్యుమరేటర్ నిర్వహించే సర్వే ను ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేయాలి..

ఎన్యుమరేటర్ నిర్వహించే సర్వే ను ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేయాలి..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం నవంబర్ 11:

ఎన్యుమరేటర్ నిర్వహించే సర్వే ను సూపర్వైజర్ లు, ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేయాలని, రోజువారీ నివేదికలను అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుండి మండలాల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కుటుంబ సమగ్ర సర్వే వివరాలను రోజువారీ నివేదికలను ఆప్లోడ్ చేయాలని అన్నారు. సర్వే చేపట్టుటకు అవసరమైన సిబ్బందిని నియమించుకుని ప్రతిపాదనలు సమర్పించాలని, వెంటనే ఆమోదిస్తామని తెలిపారు. ఎన్యుమరేటర్లు సేకరించే సమాచారాన్ని మండల ప్రత్యెక అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. సర్వే సేకరణ వేగవంతం చేయాలని, శుక్రవారం నాటికి పూర్తి చేయాలని సూచించారు. ప్రతీ రోజూ సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని, నివేదికలు అప్లోడ్ చేయాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథ్ రావు, సి.పి.ఒ. రాజారాం, వివిధ శాఖల అధికారులు, మండలాల నుండి అసిస్టెంట్ కలెక్టర్ కిరణ్మయి, తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, ప్రత్యేక అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now