జగదీష్ రెడ్డి పై సస్పెన్షన్ ఎత్తివేయాలి

జగదీష్ రెడ్డి పై సస్పెన్షన్ ఎత్తివేయాలి

ప్రశ్న ఆయుధం 15 మార్చి (జుక్కల్ ప్రతినిధి )

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బిఆర్ఎస్ నాయకులు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాస్తారోకో ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా టిఆర్ఎస్ నాయకులు నీలు పటేల్ మాట్లాడుతూ…అసెంబ్లీలో 6 గ్యారంటీలు 420 హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించడంతో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పై సస్పెన్షన్ వేటు వేయడం సరికాదని అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టే విధంగా ప్రజలను మోసం చేస్తున్నారని వారు మండిపడ్డారు.ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ నాయకులు బొల్లి గంగాధర్ గజిరే రాజు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment