*ఇంటర్ ఫలితాలలో మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ*
*ఇల్లందకుంట ఏప్రిల్ 22 ప్రశ్న ఆయుధం*
మంగళవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో ఇల్లందకుంట మండలంలో స్థానిక టేకుర్తి మోడల్ కాలేజీ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరచారని ప్రిన్సిపల్ డి. అయిలయ్య పేర్కొన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరము ఫలితాలలో ఎంపిసి కి చెందిన వై.రామ్ చరణ్ తేజ 1000 మార్కులకు గాను 943 మార్కులు బి. శృతి 732 మార్కులు సాధించగా,బైపిసి కి చెందిన ఆర్. ఉషశ్రీ 893 మార్కులు టి. పల్లవి 774 మార్కులు, సిఇసి కి చెందిన జి. అమృత 665 మార్కులు సాధించారని, ఇంటర్ ప్రథమ సంవత్సరము ఫలితాలలో ఎంపిసి కి చెందిన బి. మౌనిక 470 మార్కులకు గాను 411 మార్కులు,బి.హరినిత 400 మార్కులు సాధించగా బైపిసికి చెందిన వై. సూర్య తేజ 440 మార్కులకు గాను 391 మార్కులు సాధించారని ప్రిన్సిపల్ తెలిపారు. విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్,అధ్యాపక బృందం అభినందించారు.