గురుకుల బాలికలను బూతులు తిట్టిన ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలి

గరుకుల బాలికలను బూతులు తిడుతున్న ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలి.

డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి

గజ్వేల్ ఆగస్టు 31 ప్రశ్న ఆయుధం :

రంగా రెడ్డి శంషాబాద్ మండలం పాలమాకుల గురుకుల బాలికల ను కులం పేరుతో, బూతులు తిడుతూ నాణ్యమైన ఆహారం అందించకుండా నిర్లక్ష్యం, వివక్ష పాటిస్తున్న ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని దళిత బహుజన ఫ్రంట్ ( డిబిఎఫ్ ) రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి గజ్వేల్ విద్యార్థులను కలిసిన సందర్బంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఏగొండ స్వామి మాట్లాడుతూ చదువుకొవాల్సిన బాలికలు రోడ్డు ఎక్కి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు.పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్,కాస్మొటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు.విద్యాలయలో కనీస వసతులను కల్పించాలన్నారు.గురుకుల విద్యార్ధులకు బడ్జెట్ కొతలు లేకుండా చూడల‌న్నారు. గుడుల మీద వున్న దృష్టి బడుల పై సారించి ఆధునికమైన వసతులతో తీర్చిదిద్దాలన్నారు.

Join WhatsApp

Join Now