యేసుక్రీస్తు బోధనలు సమాజానికి మార్గదర్శక సూత్రాలు

యేసుక్రీస్తు బోధనలు సమాజానికి మార్గదర్శక సూత్రాలు:

_తాజా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

ప్రశ్న ఆయుధం

కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ డిసెంబర్ 25:

యేసుక్రీస్తు బోధనలు సమాజానికి మేలు చేసే మార్గదర్శక సూత్రాలని, ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన విలువలను అవి బోధిస్తాయని తాజా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ గారు అన్నారు. క్రిస్మస్ పండగ సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని ముత్యంపేట, కాకతీయ నగర్ తదితర ప్రాంతాల్లోని చర్చిల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఇందుప్రియ మాట్లాడుతూ ప్రేమ, క్షమ, సేవ, త్యాగం వంటి యేసుక్రీస్తు బోధనలు సమాజంలో శాంతి, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కుల, మత, వర్గ భేదాలు లేకుండా అందరూ మానవత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. క్రిస్మస్ పండుగ మానవాళికి ఆశ, ఆనందం, పరస్పర గౌరవం అనే సందేశాన్ని అందిస్తుందని తెలిపారు. అంతకుముందు చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ప్రజల సుఖసంతోషాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు యేసుక్రీస్తు జన్మ మహత్యాన్ని, ఆయన బోధనల ప్రాముఖ్యతను వివరించారు. అలాగే తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్, శంకర్ రావు, చాట్ల వంశీ, సలీం, గడ్డమీది మహేష్, రంగ రమేష్, నర్సుల్ల మహేష్, బండారి శ్రీకాంత్, పండు శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment