టీం ఏకదంతా యూత్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ
మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ ప్రశ్న ఆయుధం ఆగస్టు 31
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని దమ్మాయిగూడ మున్సిపాలిటీ ప్రజయసాయ్ గార్డెన్స్‌లో టీం ఏకదంతా యూత్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు.
ఈ కార్యక్రమానికి కీసర పోలీస్ స్టేషన్ సీఐ అర్కపల్లి ఆంజనేయులు మరియు ఎస్‌ఐ రావులకొల్లు లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరై భక్తులకు తమ ఆశీర్వాదాలు అందించారు. ఉత్సవాలను శాంతిభద్రతల మధ్య నిర్వహించాలని వారు సూచించారు.
ఈ అన్నప్రసాద వితరణలో యూత్ సభ్యులు గణేష్, రాకేష్, తరుణ్ గౌడ్, అరుణ్ గౌడ్, విక్కి తదితరులు చురుకుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం భక్తి, సేవ, సాంఘిక ఏకతను చాటిచెప్పింది.