తెలంగాణా బడ్జెట్ లో రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు -రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంస్చై ర్మన్ కొత్వాల తెలంగాణా బడ్జెట్ లో రైతులతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగనున్నదని ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి జిల్లాల డీసీఎంస్చై ర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్ ను హర్షిస్తూ పాల్వంచలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబురాలు జరిపారు. శనివారం స్థానిక పొంగులేటి క్యాంపు కార్యాలయంలోనిర్వహించిన కార్యక్రమంలో కొత్వాల పాల్గొని కేక్ ను కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. బాణాసంచా కాల్చారు. ఈ సందర్భంగా కొత్వాలమాట్లాడుతూ బడ్జెట్ లోని అంశాలు కాంగ్రెస్ ప్రజాపాలనకు నిదర్శనమన్నారు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతు సంక్షేమం కోసం 72 వేల కోట్ల రూపాయలుకేటాయించిన ఘనత కాంగ్రెస్ కే దకిందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, షెడ్యూల్డ్ కులాలు, గిరిజనులు, వెనుకబడిన, మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం వేల కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలోని ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలు అమలు పరిచిచిత్తశుద్ధిని చాటి చెప్పిందని కొత్వాలఅన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి, కాంగ్రెస్ కార్యకర్తలు సత్తా చాటాలని కొత్వాలపిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు, ఎల్ డి ఎం కోఆర్డినేటర్ బద్ది కిషోర్, లేబర్ సెల్ చైర్మన్ సాదం రామకృష్ణారావు, కాంగ్రెస్ నాయకులు ఎస్ వి ఆర్కె ర్యులు, కాల్వ భాస్కర్ రావు, కాపా శ్రీనివాస్, కనగాల నారాయణరావు, కాపర్తి వెంకటాచారి, బత్తుల వెంకటేశ్వరరావు, గంగిరెడ్డి భువన సుందర్ రెడ్డి, కందుకూరి రాము, వై వెంకటేశ్వర్లు, చాంద్ పాషా, చింతా నాగరాజు, పాబోలు నాగేశ్వరరావు, పులి సత్యనారాయణ, పైడిపల్లి మహేష్, శనగ రామచినదెర్ రావు, కొమర్రాజు విజయ్, చెరుకుపల్లి సూర్యకిరణ్, మధు, బాబు నాయక్, బాదర్ల జోషి, బానోత్ బాలాజీ, గంధం నర్సింహారావు, అజ్మీరా రమేష్, రాము నాయక్, విజయ్ కుమార్, యమ్మున మల్లిఖార్జున్, భట్టు కుమార్, వాఙ్కడోట్ రవి, భార్గవ్, బాలూ నాయక్, సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ బడ్జెట్ రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు
by admin admin
Published On: July 27, 2024 11:19 am