Site icon PRASHNA AYUDHAM

వర్గీకరణకు తెలంగాణ జర్నలిస్టు యూనియన్ సంపూర్ణ మద్దతు

IMG 20250110 WA0421

వర్గీకరణకు తెలంగాణ జర్నలిస్టు యూనియన్ సంపూర్ణ మద్దతు 

వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమానికి టీజేయు డప్పులు అందజేత 

టీజేయు రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు 

జర్నలిస్టు సంఘాలను అభినందించిన మందకృష్ణ మాదిగ

హైదరాబాద్, జనవరి 10 (ప్రశ్న ఆయుధం) :

వేల గొంతులు లక్ష డప్పులు ఫిబ్రవరి 7 న జరిగే కార్యక్రమానికి తెలంగాణ జర్నలిస్టు యూనియన్ సంపూర్ణ మద్దతు తెలుపుతూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హాజరు అయ్యారు. ఫిబ్రవరి 7న జరిగే వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమానికి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ నుంచి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ డబ్బులు మందకృష్ణ మాదిగ కు బహూకరించారు. అనంతరం టీజీయూ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు మాట్లాడుతూ 30 సంవత్సరాల నుంచి జరిగే పోరాటంలో అప్పటినుండి ఇప్పటివరకు మందకృష్ణ చేసే పోరాటానికి వెంబడి తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఉందని కప్పర ప్రసాద్ రావు అన్నారు. ఇప్పటికైనా సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేయాలని కోరుతూ చేసే పోరాటానికి తెలంగాణ జర్నలిస్టు యూనియన్ వెంబడి ఉంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం కోసం మేము సైతం కార్యక్రమంలో పాల్గొంటామని సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఐ.ఎఫ్ డబ్ల్యూ.జె. జాతీయ ఉపాధ్యక్షులు పెద్దాపురం నరసింహ, మాదిగ జర్నలిస్ట్ ఫోరం జాతీయ అధ్యక్షులు మాతంగి దాస్, జాతీయ నాయకులు లక్ష్మణ్ , ఎండబ్ల్యూ జె అధ్యక్షులు అశోక్ , మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు గాదె రమేష్, టీజేయు రాష్ట్ర ఉపాధ్యక్షులు కే బాబురావు, కార్యదర్శి కనకా రెడ్డి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డి అశోక్, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మరాఠీ కృష్ణమూర్తి, మెదక్ జిల్లా అధ్యక్షులు రామయ్య, సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ చారి, నాయకులు సాగర్, సత్యం, బాలచంద్రం, నాగరాజు, శ్రీను, శేఖర్, మహేష్, ఎల్లం రాజు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version