పోలీస్ అధికారులకు ధన్యవాదాలు తెలిపిన ఆలయ కమిటీ చైర్మన్ ధర్మకర్తలు

*పోలీస్ అధికారులను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఆలయ కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు ధర్మకర్తలు*
*జమ్మికుంట ఏప్రిల్ 18 ప్రశ్న ఆయుధం*
అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట లోని శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల పురస్కరించుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం కావడానికి పోలీసుల సేవలు చిరస్మరణీయమని ఇల్లందకుంట ఆలయ కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు అన్నారు. శుక్రవారం జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి జమ్మికుంట రూరల్ సీఐ కోరే కిషోర్ ఇల్లందకుంట ఎస్ఐ రాజ్ కుమార్ వీణవంక ఎస్ఐ తోట తిరుపతి లను మర్యాద పూర్వకంగా కలిసి వారికి స్వామి వారి ప్రసాదం స్వామివారి చిత్రపటాన్ని కళ్యాణం అక్షింతలు అందించి వారిని శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు ఆలయ చైర్మన్ రామారావు ధర్మకర్తలు తెలిపారు. అనంతరం రామారావు మాట్లాడుతూ, 13 రోజులపాటు సాగిన బ్రహ్మోత్సవాలలో పోలీస్ శాఖ అందించిన సేవలు అభినందనీయమని వారిని కలుసుకొని చిరు సన్మానం చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు పరమేశ్వర్,రవికిరణ్,గోపాల్ రెడ్డి ,కిషన్ రెడ్డి,చిరంజీవి,రామ్ రెడ్డి,నాగరాజు, లావణ్య శ్రీనివాస్ నారాయణ రెడ్డి,రాజేందర్,మల్లేష్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment