సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: ముప్పు శ్రీనివాస్ రెడ్డి

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: ముప్పు శ్రీనివాస్ రెడ్డి

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 03

నాగారం మున్సిపాలిటీ 14వ వార్డులోని హెచ్‌ఎంటీ సూర్య నగర్ కాలనీ నూతన అసోసియేషన్ సభ్యులు బుధవారం నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కాలనీ అధ్యక్షుడు రోండ్ల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వారు తమ కాలనీలో నెలకొన్న సమస్యలను వివరించారు.

రోడ్లు, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం వంటి సమస్యలపై అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డితో చర్చించారు. ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని శ్రీనివాస్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్ టీజేఎస్ పార్టీ అధ్యక్షులు చిట్యాల శ్రీనివాస్ రెడ్డి, కాలనీ జనరల్ సెక్రటరీ కోట రామి నాయుడు, జాయింట్ సెక్రటరీ పిట్టల రాజు, షేక్ గౌస్, అలాగే కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment