Site icon PRASHNA AYUDHAM

జర్నలిస్టు మద్దయ్య పై దాడి చెసిన భూ అక్రమణా ముఠా దుండగులను అరెస్టు చేయాలి

జర్నలిస్టు మద్దయ్య పై దాడి చెసిన భూ అక్రమణా ముఠా దుండగులను అరెస్టు చేయాలి

డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్

సిద్దిపేట నవంబర్ 21 ప్రశ్న ఆయుధం :

సైబారబాద్ కమిషనరేట్ పరిధిలో ని దుండిగల్ పొలీస్ స్టేషను పరిధిలో ప్రభుత్వ భూములను,చెరువును అక్రమించి వెంచర్ చెస్తున్న త్రిపుర ల్యాండ్ మార్క్ నిర్మాణ సంస్ధ అక్రమాలు భూ కబ్జాల పై వార్తలు రాసిన జర్నలిస్టు మద్దయ్య పై పధకం ప్రకారం సాముహిక దాడిచేసిన దుండగులైన సుధాకర్ తదితరులను తక్షణమె అరెస్టు చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేశారు. గురువారం దుండిగల్ లో జర్నలిస్టు మద్దయ్య ను,ఇతర జర్నలిస్టు లను సిఐ,ఎసిపి లను కలిసి దాడి వివరాలను తెలుసుకున్నారు. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని కోరారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ బాచుపల్లి మండలం బౌరంపేటలో ని డిపిపల్లి లోని సర్వే నెంబర్181,282,184,187,188,199 లో ఎఫ్.టిఎల్ భూమిని అక్రమించి వెంచర్ నిర్మాణం చేస్తున్నారు అని అన్నారు. ఈ భూ అక్రమాల పై వరుస కధనాల రాయడంతో స్పందించిన తహసీల్దారు, నీటి పారుదల శాఖ అధికారుల విచారణకు వెళ్ళిన సమయంలో వార్త సేకరణకు ఇతర జర్నలిస్టు లతో కలిసి వెళ్ళిన జర్నలిస్టు మద్దయ్య పై ఒక్కసారిగా త్రిపుర ల్యాండ్ మార్క్ నిర్మాణ సంస్ధ యండి సుధాకర్ అదేశాల తో పది మంది దుండగులు బాల్ రెడ్డి,భూపాల్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డి, చిన్నారెడ్డి,వెంకట్ తదితర దుండగుల ముఠా సాముహిక దాడి చెసి గాయపర్చారన్నారు. నిందితుల పై దుండిగల్ పోలీసులు బిఎన్ ఎస్ ,ఎస్సీ,ఎస్టి అత్యచారాల నిరోధక చట్డం కింద కేసులు నమోదు చేసినందున పోలీసులు విచారణ పూర్తి చెసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు చెరువులను అక్రమణల పై రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా కొరడ జులిపిస్తున్న నేపధ్యంలో ప్రజా శ్రేయస్సు ప్రభుత్వ భూములను కాపాడెందుక వార్తలు రాసిన జర్నలిస్టు మద్దయ్య కు రక్షణ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమం లో మాలమహనాడు సెక్రటరీ జనరల్ బొట్టు నర్సింగ్ రావు,దాడికి గురైన జర్నలిస్టు మద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version