మహిళా డాక్టర్ పై అత్యాచారం చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి * కలకత్తాలో డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ అత్యాచారానికి హత్యకు పాల్పడ్డ దుండగులను బహిరంగంగా శిక్షించాలి సిఐటియు మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కే రాజనర్సు.డాక్టర్ పై అత్యాచారానికి హత్యకు పాల్పడిన వాళ్లని బహిరంగంగా శిక్షించాలి ఎందుకంటే దేశంలో కులము మతము మరియు ఉన్నవారు లేనివారు తాగుబోతోడు తీరు బోతోడు అనే తేడా లేకుండా వాళ్ల ప్రాణాలను కాపాడడమే నా బాధ్యత అని భావించే ఒకే లక్ష్యంతో పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం డాక్టర్లు మాత్రమే మన ప్రాణాలను కాపాడే డాక్టర్లకే మన దేశంలో రక్షణ కరువైతే ఇంకెవరికి రక్షణ కల్పిస్తారు రోజు రోజుకి మహిళల పట్ల విద్యార్థునుల పట్ల జరిగే అత్యాచారాలను చేసేవారిని నిర్భయ ఫోక్సో లాంటి చట్టాలు ఉన్న అమలు కావడం లేదని ఆరోపిస్తున్నాము వెంటనే శిక్షపడేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో సిఐటియు మున్సిపల్ యూనియన్ జిల్లా నాయకులు పోతారం ప్రభాకర్, కాట్రియాల ప్రభు, తదితరులు పాల్గొన్నారు