*కొమురవెల్లి కళ్యాణం జాతర ముహూర్తం ఖరారు*
*కొమురవెల్లి ప్రశ్ని ఆయుధం ప్రతినిధి*
ప్రముఖ సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం జరుగు మల్లికార్జున స్వామి మేడాలమ్మ కేతమ్మ కళ్యాణోత్సవం కార్యక్రమాన్ని 29-12-2024 ఆదివారం రోజున నిర్ణయించారు ఈ సందర్భంగా శ్రీ స్వామి వారి కళ్యాణము మరియు జాతర గురించి కో ఆర్డినేషన్ మీటింగ్ సిద్దిపేట కలెక్టర్ ఆఫీసు లో జరిగినది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దేవాదాయ శాఖ కమిషనరు, వారిని సిద్దిపేట జిల్లా కలెక్టర్ , పోలీస్ కమీషనర్ సిద్దిపేట వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కల్యాణము మరియు జాతర నిర్వహణకు వారు వివిధ శాఖ ల అధికారులకు తగు సూచనలు చేశారు .ఇట్టి కార్యక్రమములో కొమురవెల్లి ఆలయ కార్యనిర్వహణ అధికారి బాలాజీ వివిధ శాఖల అధికారులు , మరియు దేవాలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.