*బదిలీ అయి రిలీవ్ కానీ టీచర్లను విడుదల చేయాలి*
*ఎస్ టీ యూ జిల్లా అధ్యక్షుడు పి ఆర్ శ్రీనివాస్*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 11*
ఉపాధ్యాయ బదిలీలలో బదిలీ అయి రిలీవ్ కాకుండా యధా స్థానంలో కొనసాగుతున్న టీచర్లను వెంటనే రిలీవ్ చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిఆర్ శ్రీనివాస్, కట్టా రవీంద్రాచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జమ్మికుంట మండలంలో రాష్ట్ర కార్యదర్శి సాన కిషన్ తో కలిసి సభ్యత్వ క్యాంపెయిన్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బదిలీ అయిన టీచర్లను వెంటనే విడుదల చేయాలని ఆన్ లైన్ సాంకేతిక తప్పిదాలతో బదిలీ అయిన వారి తప్పిదాలను సవరించి వారికి న్యాయం చేయాలని అవకాశం కల్పించాలని పేర్కొన్నారు.ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు సర్వీస్ పర్సన్ల నియమాలకు సంబంధించి నిధులు, నిబంధనలు విడుదల చేయాలని అకాడమిక్ ఇయర్ ప్రారంభమై నాలుగు మాసాలు కావస్తున్న దరమిలా వెంటనే స్కూల్ గ్రాంట్ మంజూరు చేయాలని నాణ్యమైన విద్య అందించేందుకు రెగ్యులర్ పర్యవేక్షణ అధికారులను నియామకం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు జమ్మికుంట మండలంలో అన్ని పాఠశాలలో సభ్యత్వం నిర్వహించి ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి ఆర్ శ్రీనివాస్, కట్టా రవీంద్రాచారి రాష్ట్ర కార్యదర్శి సానకిషన్ జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి కోట శ్యామ్ కుమార్ శెట్టి రాజమౌళి నేరుపాటి ఆనంద్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రజాక్ పాషా పురుషోత్తం మూర్తి, జిల్లా మండల నాయకులు మేడుదుల నాగరాజు దేవుని రఘు సంతోష్ మహేందర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.