చరిత్రలో దాగి ఉన్న నిజం బైటికి రావాలి
మహబూబాబాద్ పట్టణంలో శిఖారు ఖానా గడ్డ ప్రాంతంలో ఈ నిజాం రాజు మహబూబ్ అలీఖాన్ కు ఒక నివాసం బంగ్లా(అతిధి గృహం) ఉంది…అది ఇప్పుడు ప్రత్యక్షంగా ఉంది. నిజాం పేరు మీదనే అప్పటి మానుకోటనే…మహబూబాబాద్ గా మారిపోయింది. నిజాం భారత సేనాలకు లొంగిపోయాక తెలంగాణ స్వాతంత్య్రం వచ్చాక ఆ బంగ్లాను ఒక దొర ఆక్రమించుకున్నట్లు అనుమానం…దానికి బదులుగా వారి ఆధీనంలో ఉన్న ప్రస్తుత కోర్టు ఎదురుగా ఉన్న(ఆఫీసర్ క్లబ్ బంగ్లా)ను దొరల అజమాషితో మార్పులు చేసుకొని ఇప్పుడు ఉన్న శిఖార్ ఖానా గడ్డ రాజ భవనం ఆయా స్థలాలు, విలువైన సామాగ్రీ దొరలు స్వాదీనం చేసుకున్నారు.
ఇది నిజం… చరిత్ర కారులు… ప్రభుత్వం శోధించి ఆయా భవనం, విలువైన స్థలం ఇప్పుడు స్వాధీనం చేసుకోవాలి…అలాగే అప్పటి సిల్వర్ జూబ్లీ స్థలంగా అప్పటి ప్రభుత్వ రికార్డ్ లోని స్థలం, ప్రస్తుత శ్రీనివాస్ టాకీస్ (జూబ్లీ హాల్) ప్రభుత్వం స్వాధీనం చేసుకువాలి…లేదంటే న్యాయ పోరాటం తప్పదు..