Site icon PRASHNA AYUDHAM

ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు వేతనాలు అందజేసిన….సత్యం శ్రీరంగం

IMG 20250826 WA0043

ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు వేతనాలు

అందజేసిన….సత్యం శ్రీరంగం

ప్రశ్న ఆయుధం ఆగస్టు 26: కూకట్‌పల్లి ప్రతినిధి

” శ్రీరంగం ఫౌండేషన్ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటుంది – శ్రీరంగం ఫౌండేషన్ చైర్మన్ డా. సత్యం శ్రీరంగం.”

కూకట్ పల్లి నియోజకవర్గంలోని కెపిహెచ్‌బి రోడ్ నెంబర్ 2 మరియు బాలాజీనగర్ డివిజన్ వివేకనగర్ లోని ప్రాథమిక పాఠశాలలు యొక్క ప్రధాన ఉపాధ్యాయులు మీనా కుమారి మరియు సృజనల అభ్యర్థన మేరకు ఉపాధ్యాయులకు వేతనాన్ని ఇవ్వమని కోరగా శ్రీరంగం ఫౌండేషన్ చైర్మన్ డా. సత్యం శ్రీరంగంని కోరగా వారు వెంటనే స్పందించి శ్రీరంగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2025 – 2026 విద్యా సంవత్సరం మొత్తం ప్రతి నెల వేతనాన్ని ఇస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం జులై నెల వేతనాన్ని చెక్కుల రూపంలో ఉపాధ్యాయులకు వారి కార్యాలయంలో శ్రీరంగం ఫౌండేషన్ చైర్మన్ డా.సత్యం శ్రీరంగం చేతులమీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగం ఫౌండేషన్ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Exit mobile version