బిఆర్ఎస్ కొత్త కుట్రలను దుయ్యబట్టిన …సత్యం శ్రీరంగం

బిఆర్ఎస్ కొత్త కుట్రలను దుయ్యబట్టిన …సత్యం శ్రీరంగం

ప్రశ్న ఆయుధం మే06: కూకట్‌పల్లి ప్రతినిధి

” ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ధైర్యంగా ప్రజల ముందుంచిన ముఖ్యమంత్రి అభినందనీయుడు _ సత్యం శ్రీరంగం.”

” రేవంత్ రెడ్డి మాటలలో ఆవేదనని వాస్తవ పరిస్థితిని ఉద్యోగ సంఘాలు, తెలంగాణ ప్రజలు గ్రహించాలి – సత్యం శ్రీరంగం.”

గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన సత్యం శ్రీరంగం, బెల్లయ్య నాయక్. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ బిఆర్ఎస్ కొత్త కుట్రలు..అప్పుడు విద్యార్థులను రెచ్చగొట్టారు.. తరువాత రైతులను రెచ్చగొట్టారు..పనిచేయకుండా ఐఎఎస్ లను రెచ్చగొట్టారు..కొత్తగా ఇప్పుడు ఆర్టిసి కార్మికులను..ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించేలా పావులు కదుపుతున్నారు.ఒకవైపు ఆర్టీసీ స్ట్రైక్ చేయడానికి ప్రభుత్వానికి నోటీస్ లు ఇచ్చారు. అదే సమయంలో ఉద్యోగ సంఘాలు తామూ స్ట్రైక్ కు వెళతాం అని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. ఈరోజు వాళ్ళతో చర్చలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ప్రభుత్యం ఆర్థిక సంక్షోభంలో ఉంది. వచ్చే ఆదాయం జీతాలకు పథకాలకు సరిపోవడం లేదు బయట అప్పు పుట్టడం లేదు..వాస్తవాలు లెక్కలు.. ఆదాయం ముందు పెట్టీ మీరే నిర్ణయించండి..నేను ఏ పథకం ఆపాలి..మీరే చెప్పండి..మీరు ఉద్యమం చేయాలి అనుకొంటే అది ప్రజలమీదనే అని తేల్చి చెప్పాడు.. గతం లో కెసిఆర్ ప్రభుత్వంలో మాట్లాడే దైర్యం ఎన్నడు ఉద్యోగసంఘ లు చేయలేదు.. కెసిఆర్ చెప్పిన ప్రతిదానికి తల ఊపడం తప్ప మరో ఆప్షన్ ఉండేది కాదు..జీతాలు 15 తారీకు ఇచ్చిన అడిగే ధైర్యం లేదు..ఒక విధంగా చెప్పాలి అంటే ఉద్యోగస్తుల ను కెసిఆర్ గౌరవంగా ఎన్నడు చూడలేదు..ఉద్యోగ సంఘాల నేతల తోకలు కత్తిరించి..వాళ్ళ జుట్టు గుప్పెట్లో పెట్టుకొన్నాడు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెచేసి ఎంతో మంది కి నెలల తరబడి జీతాలు లేక మరణిస్తే కూడా కెసిఆర్ పట్టించుకోలేదు..ఆర్టీసీ మేఘ కృష్ణారెడ్డి కి కట్టపెట్టడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి..ఎలక్ట్రిక్ బస్ ల కొనుగోళ్లు జరిగిపోయాయి..ఉద్యోగస్తులు బలవంతం చేసి వాలంటరీ రిటైర్మెంట్ కు బలవంతం చేశారు. ఉద్యోగస్తులకు ఎవరూ ఊహించని జీతాలు వస్తూనే ఉన్నాయి.. కానీ ఇంకా అసంతృప్తి ఎందుకు..?ప్రభుత్వం ఉదాసీనం గా ఉండటమే తప్పా..?మీకు జీతాలు కష్టం గా ఉన్నా1వ తారీకు ఇవ్వడం ప్రభుత్వ తప్పా..?వాస్తవాలు తెలుసుకోకుండా మీ పోరాటం ఎవరి మీద చేస్తారు..?అసలు మీరు చేస్తున్న ఉద్యోగానికి మీరూ న్యాయం చేస్తున్నారేమో గుండె మీద చేయు వేసుకొని చెప్పండి అని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటే ఏంటి? వచ్చే వాడు చూసుకుంటాడు? వచ్చే వాడు అనుభవిస్తాడు అని బాధ్యత లేకుండా వ్యవహరించి ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ కంటే ప్రస్తుత పరిస్థితిని ప్రజలకు చెప్పి సహకరించమని కోరడం మంచి పరిణామం అని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికులతో చర్చలు చేసినప్పుడు వాస్తవాలు బయట పడ్డాయి..గత ప్రభుత్వంలో సమ్మె చేస్తే ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఆ ప్రభుత్వం ఎన్ని బాధలు పెట్టింది అన్ని విషయాలు వాళ్ళ దృషి కి తేగా వాస్తవాలు తెలుసుకొని కేటీఆర్ డ్రామాలు అర్థం చేసుకొన్న కార్మికులు సమ్మె విరమించారు. రేవంత్ రెడ్డి ని దూషించిన తీరు..రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను చివరికి, బావమర్ది..ఇయ్యంకుడు నీ కూడా వదల లేదు..పదేపదే దొంగ అని రేవంత్ రెడ్డిని అనడం ద్వారా తాను సంతోష పడుతూ పిచ్చి జోక్స్ తో ప్రక్క వారిని నవ్విస్తూ తన స్థాయి దిగజార్చుకొని ఒక జోకర్ హావభావాలు లతో రేవంత్ రెడ్డి సీఎం పదవికి పనికిరాడు అని చెప్పే ప్రయత్నం చేశాడు. డిల్లీ కి 42 సార్లు వెళ్ళడం తోనే ఖజానా ఖాళీ అయ్యిందని చెప్పడం పెద్ద జోక్.. కెసిఆర్ ఫాం హౌస్ లో పడుకొని పాలన చేస్తే పోలీస్..సచివాలయ సిబ్బంది ప్రతి రోజు ఫాం హౌజ్ కు వెళ్ళడం..కెసిఆర్ కోసం కిలోమీటర్ ల కొద్ది పోలీస్ సెక్యూరిటీ కి ఎన్ని వందల కోట్లు ఖర్చు చేశాడో కేటీర్ కు తెలియకపోవడం విచిత్రం. కెసిఆర్ పనికి మాలిన పాలనకు జనం చీకొడితే అధికారం దూరమవుతే ఇంకా సిగ్గులేకుండా మీడియా ముందు తప్పుడు లెక్కలు తప్పుడు మాటలతో రేవంత్ రెడ్డి వారిమీద బురద చల్లడం తో ప్రజలు చీదరించుకొన్నారు.కేటీఆర్ చేసిన తప్పుడు ఆరోపణల కు వెంటనే బుద్ధి చెప్పాలన్నారు.

Join WhatsApp

Join Now