నందిపేట్, బతుకమ్మ: గణేష్ నిమజ్జనం నిమిత్తం
నందిపేట్ లోని ఉమ్మెడ బ్రిడ్జిని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు.
నిజాంబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం ఆగస్టు 30)
నందిపేట్ లోని ఉమ్మెడ బ్రిడ్జిని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం పర్యవేక్షించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా సంబంధిత పోలీస్ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా అక్కడి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు, నిమజ్జన కోసం ఏర్పాటు చేసిన క్రేన్లు, లైటింగ్, వైద్య సదుపాయాలను పరిశీలించారు. నందిపేట్ సబ్-ఇన్స్పెక్టర్కు పలు సూచనలు చేశారు. నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డీజే లను అనుమతించకూడదని తెలిపారు. ప్రజలు కూడా పోలీసు విభాగానికి సహకరించి, గణేశ్ నిమజ్జనాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట నందిపేట ఎస్సై శ్యామ్ రాజ్ ఉన్నారు.