నిరుద్యోగుల గొంతుకనై మీకోసం పోరాడుతా. విద్యార్థులు, నిరుద్యోగులు, అందరూ ఒకటై ఓటు ద్వారా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి.

*నిరుద్యోగుల గొంతుకనై మీకోసం పోరాడుతా. విద్యార్థులు, నిరుద్యోగులు, అందరూ ఒకటై ఓటు ద్వారా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి.*

నిజామాబాద్  ఫిబ్రవరి 05

IMG 20250205 WA0097

ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్: అంజిరెడ్డి చిన్న మైల్

విద్యార్థులు, నిరుద్యోగులు, అందరూ ఒకటై ఓటు ద్వారా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని, నన్ను ఎమ్మెల్సీగా గెలిపిస్తే విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన మీ గొంతుకనై ప్రశ్నిస్తానని బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి అన్నారు. బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఓ ప్రైవేటు హోటల్లో బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో

ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మాట్లాడుతూ. బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించిన ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షులు నడ్డా, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణలకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. గత 30 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేశానని, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీకి సేవలు అందించానన్నారు. టికెట్టు విద్యార్థుల ఉద్యోగుల నిరుద్యోగుల పక్షాన పోరాటం చేశానన్నారు. భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించామని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని నమ్మకం ఉందని, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. అందుకు కేంద్రం పథకాలు ముఖ్య కారణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అని చెప్పి, ఒక్క బస్సు తప్ప ఏదీ సరిగ్గా అమలు చేయలేదని అన్నారు. విద్యార్థులకు ఉద్యోగులకు, నిరుద్యోగులకు తీరని అన్యాయం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం కృషి చేయడం లేదని, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ ఒకటై ఓటు ద్వారా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని సూచించారు. కాంగ్రెస్ హయాంలో 12 వేల పాఠశాలలు మాత్రమే నడుస్తున్నాయని, 8 వేల పాఠశాలలు మూతపడ్డాయని, ప్రవేట్ కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదని గత ప్రభుత్వంలో 6850 కోట్లు పెండింగ్ ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో 7500 కోట్లకు పెరిగిందని అన్నారు. విద్యార్థులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్నారు. యువతకు కొత్తగా ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి పది లక్షల పెంచుతామని ప్రజలను మభ్య పెట్టారని, ఏ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందడం లేదన్నారు. బిజెపి పక్షాన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడ్డ నాకు విద్యార్థులు యోగులు మద్దతు తెలుపుతున్నారని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేలా నా వంతు కృషి చేస్తానని అన్నారు. నిజామాబాద్ బిజెపి పార్టీ తరపున అత్యధిక మెజార్టీ వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చిన జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి, పల్లె గంగారెడ్డి లకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment