Site icon PRASHNA AYUDHAM

మే 20న జరగాల్సిన సార్వత్రిక సమ్మె జూలై 9 కి వాయిదా

IMG 20250516 WA0017

మే 20న జరగాల్సిన సార్వత్రిక సమ్మె జూలై 9 కి వాయిదా

– సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల రిత్య మే 20న జరగాల్సిన సార్వత్రిక సమ్మె జూలై 9 కి వాయిదా వేయడం జరిగిందని సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ

భారతదేశంలో ఈ దేశ కార్మికులకు, కర్షకులకు, రైతులకు, వ్యవసాయ కూలీలకు, ప్రమాదకరమైనటువంటి నాలుగు లేబర్ కోర్టులను వ్యతిరేకిస్తూ జాతీయస్థాయి ట్రేడ్ యూనియన్ సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఈనెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చి వేల సంఖ్యలో దేశ ప్రజలు ఎక్కడికక్కడ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది, కానీ భారతదేశంలో నెలకొన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఈనెల అంటే మే 20 న జరగాల్సిన సార్వత్రిక సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తూ

జులై 9 నా ఈ సమ్మెను జరపాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ జిల్లాలో కార్మికులు, రైతులు, కర్షకులు ఈ విషయాన్ని గమనించి జూలై 9న జరిగే ఈ సార్వత్రిక సమ్మెలో తమరు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. మోడీ కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటాలు చేయాలని పిలుపునిస్తున్నాం అన్నారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు ఎస్ వెంకట్ గౌడ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు పాల్గొన్నారు.

Exit mobile version