*దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన,సంస్కరణల రూపశిల్పి ,రాజనీతజ్ఞుడి అకాల మరణం తీరని లోటు —-రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జి రవి కుమార్ యాదవ్*
*(ప్రశ్నఆయుధం),డిసెంబర్,27,శేరిలింగంపల్లి,ప్రతినిధి*
కొండాపూర్ మసీద్ బండ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నాయకుల, కార్యకర్తల సమక్షంలో భారతదేశ మాజీ ప్రధాని కీర్తిశేషులు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ
ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు. దేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో ఆయన కీలక పాత్ర పోషించాలని దేశానికి ఆయన చేసిన సేవ,రాజకీయ జీవితం వినియంతో కూడిన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపారు.
పార్టీలకతీతంగా ఎవరెన్ని విమర్శలు చేసిన మౌనంగా తన పనిని తాను చేసుకుంటూ అంతే మౌనంగా తన జీవన ప్రస్థానానికి వీడ్కోలు పలికారని చింతిస్తూ.
*ఆనాడు ఆయన ప్రవేశపెట్టిన సమాచార హక్కు చట్టం (RTA) పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం,జాతీయ ఆహార భద్రత చట్టం,విద్య హక్కు చట్టం, ప్రతి పౌరునికి ఆధార్ ఆధార్ గుర్తింపు కార్డు ఉండాలని సదుద్దేశంతో ఎన్నో సంస్కరణలు తెచ్చి మంచి పేరు ప్రతిష్టలు గడించిన , ఆనాటి ప్రధాని వాజ్పేయి ప్రవేశపెట్టిన స్వర్ణ చతుర్భుజి వంటి కార్యక్రమాలను మన్మోహన్ సింగ్ సర్కార్ కొనసాగించింది* అని కొనియాడుతూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆంజనేయులు సాగర్,రాజు, రమేష్, కుమార్ యాదవ్,పద్మ,రేణుక, మహేష్, రాజు, ప్రదీప్,మహేష్ ,మధు,మనోజ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు