సమర శంఖారావం గోడప్రతుల ఆవిష్కరణ

*సమర శంఖారావం గోడప్రతుల ఆవిష్కరణ*

ప్రశ్న ఆయుధం, కామారెడ్డి :

కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఈ నెల 30 వ తేదీన హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద జరిగే బీసీ విద్యార్థుల సమర శంఖారావం గోడప్రతులను ఆవిష్కరించారు. బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల బలిదానాలతో వచ్చిన తెలంగాణలో విద్యార్థుల చదువులకే భరోసా లేదని, తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్య కోర్సులు చదివే లక్షలాదిమంది పేద బీసీ,ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు గత నాలుగు సంవత్సరాలుగా ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో బడుగు విద్యార్థుల చదువులు అటకెకించారని అన్నారు.

ప్రయివేట్ కళాశాలల యాజమాన్యాలు మేము కాలేజీలు నడపలేము అని సమావేశాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితిలో ఉన్నాయని, విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉందని అన్నారు. గత బియర్ఎస్ ప్రభుత్వ బకాయిలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వుకుండా,బడా కాంట్రాక్టర్ల బిల్లులు వేల కోట్లు విడుదల చేస్తూ బడుగు వర్గాల విద్యార్థుల ఫీజులు నిధులు మాత్రం విడుదల చేయకపోవడం చాలా అన్యాయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరో వారం పది రోజుల్లో విద్యార్థుల వార్షిక పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కళాశాల యజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్టు విక్రమార్కలు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బడా కాంట్రాక్టర్ బిల్లులు నిలిపివేసి బడుగు విద్యార్థుల ఫీజుల నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఫీజులు విడుదల చేయాలని, అలాగే ప్రైవేటు యూనివర్సిటీలలో బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక రిజర్వేషన్లు అమలు చేయాలనే ప్రధాన డిమాండ్ తో ఈనెల 30వ తేదీన హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద వేలాదిమంది విద్యార్థులతో బీసీ విద్యార్థుల సమర శంఖారావం సభను నిర్వహిస్తున్నామని ఈ సమర శంఖారావంకు వేలాది మంది విద్యార్థులు తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం అధ్యక్షులు వినోద్ నాయక్, కిషన్, సందీప్ నాయక్, గణేష్, రమేష్, శ్రీనివాస్, పవన్, చక్రధర్, మోహన్, శివరాం తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now