భూ.. కబ్జా గురించి మాట్లాడితే బెదిరిస్తున్నారు.. – పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు

భూ.. కబ్జా గురించి మాట్లాడితే బెదిరిస్తున్నారు..

– పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు

IMG 20250302 WA0066

ఆయుధం,కామారెడ్డి (మాచారెడ్డి) మార్చి 2.

కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండల కేంద్రంలో జరుగుతున్న భూకబ్జాపై మాట్లాడినందుకు తనను సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారని ఈ విషయంపై మాచారెడ్డి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు మాజీ ఉప సర్పంచ్ తోకల కిషన్ తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ

మాచారెడ్డి మండల కేంద్రం గాజ్య నాయక్ తండ అంగడి బజార్ లోని గ్రామపంచాయతీ కి చెందిన స్థలం రోజు రోజుకు కబ్జాకు గురవుతుందని తాను ఒక ప్రకటనలో తెలిపారు. అంగడి బజార్లో ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న వారి పర్మిషన్ వరకు ఇల్లు కట్టుకొని రోడ్డుమీదికి రేకుల షెడ్డు వేసుకొని కబ్జాకు గురి చేసుకుంటున్నారని గ్రామ కార్యదర్శి, గ్రామ ప్రత్యేక అధికారికి తెలిపిన పట్టించుకోవడంలేదని తోకల కిషన్ ఆవేదన వ్యక్తం చేశాడు. కొన్ని పత్రికలలో ఈ స్థలానికి చెందిన విషయంపై పలు వార్త పత్రికలో ప్రచురితం కావడంతో భూమిని కబ్జా చేస్తున్న వ్యక్తులు ఒక సోషల్ వాట్సాప్ ద్వారా బూతులు తిడుతూ తోకల కిషన్ బెదిరిస్తున్నారని తన వార్త పత్రికల విలేకరులకు తెలిపారు. ఇట్టి విషయంపై మాజీ ఉపసర్పంచ్ తోకల కిషన్ మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపారు. మాచారెడ్డి ఎస్సై అనిల్ కుమార్ ఫిర్యాదును తీసుకోగా అట్టి ఫిర్యాదును దర్యాప్తు చేస్తానని దానిపై పూర్తి విచారణ చేసి మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారనీ తోకల కిషన్ తెలిపారు. గ్రామ పంచాయతీకి చెందిన భూములో వేసిన రేకుల షెడ్డును గ్రామపంచాయతీ అధికారులు తీసి వేయని యెడల డి ఎల్ పి ఓ కి ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు.

Join WhatsApp

Join Now