Site icon PRASHNA AYUDHAM

సుమక్క చెప్తేనే భూములు కొన్నాం.. మొత్తుకుంటున్న బాధితులు…!!

IMG 20240807 WA0048

టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమ కనకాల వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ప్రచారం చేసిన రాకీ అవెన్యూస్ సంస్థ బోర్డు తిప్పేయడంతో బాధితులు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలంటూ ఫలకార్డులు పట్టుకొని నిరసన తెలియజేశారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. రాజమండ్రిలో రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మధ్యతరగతి కుటుంబాలకు 26 లక్షలకే సొంత ఇల్లు ఇప్పిస్తామని ఆఫర్ పెట్టారు.ఆ సంస్థకు యాంకర్ సుమ కనకాల ప్రచారం చేశారు. దాంతో.. ఆ సంస్థను నమ్మిన ప్రజలు లక్షల్లో డబ్బులు చెల్లించి ప్లాట్లు బుక్ చేసుకున్నారు. అలా అందరి నుండి దాదాపు రూ.88 కోట్లు వసూలు చేసిన తరువాత ఇప్పుడు బోర్డు తిప్పేసింది సంస్థ. తీరా మోసపోయామని తెలుసుకున్న బాధితులు రోడ్ ఎక్కారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులతో పాటు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొంతమందేమో కేవలం సుమ కనకాల ఆ సంస్థకు ప్రచారం చేయడం వల్ల ప్లాట్స్ కొన్నామని, ఇప్పుడు వాళ్ళు బోర్డు తిప్పేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి.. సుమ కూడా తమకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

Exit mobile version