ఒక కుటుంబానికి సంబంధించిన ఓట్లని ఒకే చోట ఉండాలి
మండల సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు
జమ్మికుంట ఇల్లందకుంట ఆగస్టు 30 ప్రశ్న ఆయుధం
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామపంచాయతీ వార్డుల వారీగా తయారుచేసిన ఓటర్ లిస్ట్ ప్రక్షాళనలో భాగంగా కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొని మాట్లాడుతూ ఓటర్ లిస్టులో ఒకే కుటుంబానికి సంబంధించిన ఓట్లన్నీ ఒకే చోట ఉండాలని వరుస క్రమంలో ఉన్నట్లయితే బాగుంటుందని తెలిపారు దానికి సంబంధించిన ప్రక్రియ గ్రామపంచాయతీ కార్యదర్శితో పూర్తి చేయాలని ఒక వార్డులో ఒక కుటుంబం వచ్చే విధంగా చూడాలని తెలిపారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఓటర్కు అవకాశం కల్పించాలని ఎంపీడీవోను కోరారు ఎంపీడీవో రాజేశ్వరరావు మాట్లాడుతూ ఓటర్ లిస్టులో పరిశీలించి ఏమైనా అభ్యర్థనలు ఉంటే సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శులకు తెలియజేయాలని కోరారు ఈ సమావేశంలో కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ సిపిఐ సిపిఎం పార్టీల నాయకులు పెద్ది కుమార్ బైరెడ్డి రమణారెడ్డి కందాల కొమురెల్లి మాదారపు రత్నాకర్ శ్రీకాంత్ మల్లయ్య తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు