Site icon PRASHNA AYUDHAM

విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వార్డెన్ కు దేహశుద్ధి

మహబూబాబాద్ జిల్లా:సెప్టెంబర్ 19

మహబూబాబాద్ జిల్లాలో హాస్టల్ విద్యార్థిని పట్ల అస భ్యంగా ప్రవర్తించిన వార్డెన్‌ కు స్టూడెంట్, తల్లిదండ్రు లు,బంధువులు ఈరోజు దేహశుద్ధి చేశారు.

మహబూబాబాద్ పట్టణానికి చెందిన గాదె రుక్మా రెడ్డి.. ఓ ప్రైవేటు స్కూల్‌లో వార్డెన్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని పట్ల ఆసభ్యం గా ప్రవర్తించాడు. ఆ విద్యా ర్థిని ఈ విషయాన్ని తల్లిదం డ్రులకు చెప్పడంతో.. వారు హాస్టల్‌కు వచ్చి వార్డెన్‌పై దాడి చేశారు.

స్కూల్ అవరణంలో వార్డెన్‌ను కొట్టడంతో.. పిల్లలు భయాందోళకు గురయ్యారు. అటు వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థిని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

హాస్టల్ వార్డెన్ ను వెంటనే విధుల నుంచి తొలగించా లని, విద్యార్థిని తల్లి దండ్రు లు డిమాండ్ చేశారు . విద్యార్థిని బంధువులు ఒక్కసారిగా దాడి చేయ డంతో.. అతన్ని ప్రిన్సిపాల్ ఆఫీస్ రూమ్‌లో బంధించారు.

ఈ వ్యవహారంలో పాఠశాల యాజమాన్యం తీరుపైనా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తప్పు చేసిన వార్డెన్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విద్యార్థిని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…

Exit mobile version