పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం
ప్రశ్న ఆయుధం జనవరి 26:
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అని తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ రాష్ట్ర చైర్మన్ మనాల మోహన్ రెడ్డి అన్నారు.
బాల్కొండ మండలంలోని జలాల్పూర్ గ్రామంలో జరిగిన ఇందిరమ్మ ఇల్లు 23 ఇందిరామ్మా ఆత్మీయ భరోసా 73, నూతన రేషన్ కార్డులు 46,రైతు భరోసా 380 స్పెషల్ అధికారులతో కలసి లబ్దిదారులకు ప్రొసీడింగ్ కాపీలు అందచేశారు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి హామీల ప్రకారం ప్రతి పేద ఇల్లు లేని వారికి, రేషన్ కార్డ్ లేని వారికి అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని ఆయన అన్నారు,ఈ కార్యక్రమం బాల్కొండ రెవెన్యూ మండల అభివృద్ధి అధికారి అన్ని శాఖల సమన్వయంతో జలాల్పూర్ లో
కార్యక్రమం నిర్వహించారు. ఇది ఇలా ఉండగా రేషన్ కార్డు రాణి ఇల్లు లేని నిరుపేదలు ఒక్కసారిగా లేచి తమకు రేషన్ కార్డులు ఎందుకు రాలేదని ఇందిరమ్మ ఇల్లు కట్టాలి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు జలాల్పూర్ లో జరిగిన రేషన్ కార్డ్స్ లిస్టులో అవినీతి జరిగిందని .రాష్ట్రం లో రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలనలో పార్టీకి చెడ్డ పేరు తీస్తున్న కొందరు స్వంత పార్టీ నాయకుల స్వార్థo వల్ల ప్రభుత్వానికి ముఖ్య మంత్రికి చెడ్డ పేరు వచ్చిందని పైగా
ఈ రోజు పంపిణీలో డబ్బున్న వాళ్ళకు వ్యవసాయ భూమున్నవాళ్లకు ఆర్థికంగా బలం ఉన్న వాళ్లకు మాత్రమే స్థానిక నాయకులు ఇచ్చుకున్నారని గత 20;ఏళ్లుగా ఒకే కుటుంబంలో కుమారులు వేరే కాపురం ఉంటున్న వారు రేషన్ కార్డుల కోసం అనేక సార్లుగా ధరఖాస్తు చేసిన కూడా రేషన్ కార్డులు రాలేదని ఆరోపించారు. వ్యవసాయ భూములు, ఆర్థికంగా బాగున్న వారికే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారని ఆరోపించారు,ఈ కార్యక్రమం లో తెలంగాణ కోపరేటివ్ సొసైటీ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఎమ్మార్వో శ్రీధర్, ఎంపీడీవో భాస్కర్ రెడ్డి, ఇజిఎస్ ఏపీవో ఇందిరా,ఎంఈఓ రాజేశ్వర్, స్పెషల్ ఆఫీసర్ పంచాయతీ సెక్రటరీలు ఫీల్డ్ అసిస్టెంట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జలాల్పూర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.