నల్గొండ: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
Jul 12, 2025,
పేదల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా తిప్పర్తి, మాడుగులపల్లి, నల్గొండ పట్టణాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభాలు చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం పంపిణీ ఘనత తమ ప్రభుత్వానిదేనని, పేదలకు సేవ చేయడం తమ అదృష్టమన్నారు.