Site icon PRASHNA AYUDHAM

పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

IMG 20250723 WA0101

*పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం*

*సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి..*

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జులై 23 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తమహేశ్వరరావు

గుమ్మలక్ష్మీపురం మండలంలో గోయ్యిపాక పంచాయతీలో రసాబడి, టంకు, కితలాంబ గ్రామాల్లో బుధవారం నాడు మండల పార్టీ అధ్యక్షులు *అడ్డాకుల నరేష్* ఆధ్వర్యంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు కురుపాం ఎమ్మెల్యే *తోయక జగదీశ్వరి* పాల్గొన్నారు. ముందుగా టీడీపీ శ్రేణులు, గ్రామస్తులు పూలమాల వేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరిగి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలు పంచుతూ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసిపి ఐదేళ్ల పాలనలో జరగని అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలోనే చేశామని, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తున్నాం. పింఛన్ రూ. 1000 పెంచడానికి జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్లు పడితే చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే ఒక్క సంతకంతో పింఛను రూ.4000 వేలకు పెంచారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇచ్చాం, మహిళలకు ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించబోతున్నాం. ఈ నెలలోనే రైతులకు అన్నదాత సుఖీభవ కూడా అందజేస్తాం అని తెలియజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ కడ్రక కళావతి, సర్పంచ్ కేరంగి లక్ష్మీ, నాయకులు పాడి సుదర్శన్ రావు, భారతమ్మ, సింహాచలం, లక్ష్మణరావు, దాసు, ధర్మరావు, కోటి, వెంకటరావు, కృష్ణ, రంజిత్, బుజ్జేశ్వరరావు, పురుషోత్తం, సీతారాం, అనిబాబు, అనిల్, ప్రసాదరావు, సుందర్ రావు, రమేష్, శరత్ కుమార్, ప్రభాకర్ రావు, సామూర్తి, బూత్ కన్వీనర్ అనీష్, రాజేష్, పెంటయ్య, కామేష్, శ్రీను, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Exit mobile version