కాలనీల అభివృద్ధికి వినతిపత్రాలు సమర్పించిన గోధుమకుంట, ప్రకృతి వనం, తరుణ్ ఎంక్లేవ్ వాసులు

**కాలనీల అభివృద్ధికి వినతిపత్రాలు సమర్పించిన గోధుమకుంట, ప్రకృతి వనం, తరుణ్ ఎంక్లేవ్ వాసులు**

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం జూలై 6

నాగారం మున్సిపాలిటీ పరిధిలోని గోధుమకుంట టిపిఎస్ కృష్ణానగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు ఆదివారం రోజు తమ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనుల కోసం నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

అదే విధంగా, నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో ఉన్న ప్రకృతి వనం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మరియు తరుణ్ ఎంక్లేవ్ అసోసియేషన్ సభ్యులు కూడా తాము ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేస్తూ అభివృద్ధి పనులను చేపట్టాలంటూ శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేకంగా వినతిపత్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ, పలు కాలనీల్లో రోడ్లు, డ్రైనేజ్, స్ట్రీట్ లైట్లు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment