అశ్వరావుపేట నియోజకవర్గం ఆదివాసీ నాయకులు తంబల్ల రవి మాట్లాడుత
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పేరుకుపోయిన పిచ్చి రొట్టా
పత్రికల్లో కథనాలు వచ్చిన పట్టించుకోని అధికారులు
పై పైన కలుపు మందు కొట్టేసి చేతులు దులుపుకున్న అధికారులు
ఎలాంటి ప్రమాదం జరగకముందే క్లీన్ చేపించాలంటున్న పిల్లల తల్లిదండ్రులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మెయిన్ రోడ్డు ప్రక్కన ఉన్న ప్రాథమిక పాఠశాల మరియు చిన్నపిల్లల అంగన్వాడి కేంద్రం ఉన్నది,దాని చుట్టు పక్కల మొత్తం పిచ్చిరోట్టతో పేరుకుపోయి చాలా ప్రమాదకరంగా ఉన్నది పలుమార్లు పత్రికల్లో కథనాలు వచ్చినా కూడా స్పందన లేని అధికారులు,రెండు వారాల క్రితం పై పైన చెత్తకు కలుపు మందు కొట్టి చేతులు దులుపుకున్న అధికారులు,పిచ్చి రోట్ట అధికంగా ఉండటం వల్ల విష పురుగులు సంచరించే అవకాశం ఉన్నది,అశ్వరావుపేట నియోజకవర్గం ఆదివాసీ నాయకులు తంబల్ల రవి మాట్లాడుతూ ఉపాధ్యాయులు లేదా స్థానిక అధికారులు స్పందించి పిల్లలకి ఎలాంటి ప్రమాదం జరగకముందే పిచ్చి రొట్టను క్లియర్ చేపించాలని,పిల్లలు ఆడుకోవడానికి స్థలాన్ని అనుకూలంగా తయారు చేయాలని కోరారు.