వయోవృద్ధుల జ్ఞానం సమాజానికి అమూల్యం: కలెక్టర్
అంతర్జాతీయ వయోవృద్ధులు దినోత్సవంలో సందేశం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 21:
వయోవృద్ధుల అనుభవం, జ్ఞానం, విలువలు సమాజ నిర్మాణానికి పునాది అని, వారికి గౌరవం, ఆరోగ్యం, భద్రత కల్పించడం ప్రతి పౌరుడి బాధ్యత అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధులు దినోత్సవం-2025 సందర్భంగా “Older Persons Driving Local & Global Action – మన ఆకాంక్షలు, మన శ్రేయస్సు, మన హక్కులు” థీమ్‌తో జరిగిన కార్యక్రమంలో పాల్గొని జ్యోతిప్రజ్వలన చేశారు. వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. క్రీడల్లో విజేతలకు మెమెంటోలు అందించి, అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో శాఖాధికారులు, రెడ్‌క్రాస్ ప్రతినిధులు, తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.