Site icon PRASHNA AYUDHAM

ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌లోకి బర్లతో ప్రవేశించిన మహిళ

IMG 20250801 085011

ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌లోకి బర్లతో ప్రవేశించిన మహిళ

“బర్ల షెడ్ కూలగొట్టారంటూ” ఎమ్మెల్యే ఇంట్లోకి ప్రవేశించిన బాధితురాలు

“షెడ్డయ్యే దాకా బయటకి వెళ్లను” అంటూ ఆగ్రహం

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనే తాపత్రయంగా బస

బాధితురాలి ఆరోపణ: “అందరూ ఎమ్మెల్యే సారే చేసిండంటున్నారు!”

ఘటన భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి నియోజకవర్గంలో

భూపాలపల్లిలో MLA క్యాంప్‌ కార్యాలయంలోకి బర్లతో దూసుకెళ్లిన మహిళ!

భూపాలపల్లి జిల్లాలో ఓ మహిళ తన గోడుపు వినిపించుకునే వరకు ఎమ్మెల్యే ఇంట్లోనే ఉంటానంటూ తపన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళ్తే…

ఒక స్థానిక మహిళ మాట్లాడుతూ – “మా బర్ల షెడ్డు కూలగొట్టారు. ఎవరిని అడిగినా ఇదంతా ఎమ్మెల్యే సార్ చెప్పగానే జరిగిందంటున్నారు. షెడ్డయ్యే దాకా బయటికి వెళ్లను. నా, సమస్య పరిష్కరిస్తేనే బయటికి వస్తా” అని ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ మాటలతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ వద్ద బర్లతోపాటు బస చేయడం ప్రారంభించింది. ఎమ్మెల్యే సాయం కోరుతూ చేసిన ఈ నిరసన ప్రజల మధ్య చర్చనీయాంశమైంది.

వెనుక ఉన్న నిజాలు ఏంటి? షెడ్ కూల్చివేతకు ప్రభుత్వ ఆదేశాలేనా? లేక రాజకీయ కుట్రా? — పూర్తి వివరాలపై అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.

Exit mobile version